పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : శుకముని యాగమనంబు

  •  
  •  
  •  

1-519-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మ్మహాత్ము షోడశాబ్ద వయోరూప,
మన, గుణ, విలాస, కౌశలములు,
ముక్తికాంత సూచి మోహిత యగునన
నితర కాంత లెల్ల నేమి సెప్ప.

టీకా:

ఆ = ఆ; మహా = గొప్ప; ఆత్ము = ఆత్మ కలవాని; షోడశ = పదహారు (16); అబ్ద = సంవత్సరముల; వయస్ = ఈడు; రూప = రూపము; గమన = నడవడిక; గుణ = గుణములు; విలాస = శోభ, ప్రకాశము; కౌశలములు = నేర్పరితనములు; ముక్తి = ముక్తి అను; కాంత = స్త్రీ; చూచి = చూసి; మోహిత = మోహింపబడినది; అగున్ = అగును; అనన్ = అనగా; ఇతర = ఇతర; కాంతలు = స్త్రీలు; ఎల్లన్ = అందరి గురించి; ఏమి = ఏమి; సెప్పన్ = చెప్పగలము.

భావము:

ఆ మహాత్ముని పదహారేళ్ల నవయౌవనం చూస్తే ఆ సుందర గమనం గమనిస్తే, ఆ గుణవిశేషాలు ఆలోకిస్తే, ముక్తికాంత సైతం ముచ్చటపడి మోహిస్తుందంటే ఇక ఇతరకాంతల విషయం వేరే చెప్పే దేముంది.