పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : శుకముని యాగమనంబు

  •  
  •  
  •  

1-518-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని లోకులం గినిసి యెగ్గులు వల్కనివాఁడు, గోరికల్
గోనివాఁడు, గూటువలఁ గూడనివాఁడు, వృథా ప్రపంచముం
జేనివాఁడు, దైవగతిఁ జేరిన లాభము సూచి తుష్టుఁడై
నేనివాని చందమున నేర్పులు సూపెడువాఁడు, వెండియున్.

టీకా:

ఈరు = ఈయరు; అని = అని; లోకులన్ = ప్రజలను; కినిసి = కోపించి; ఎగ్గులు = నిందలు; పల్కని = పలుకని; వాఁడు = వాడు; కోరికల్ = కోరికలు ఏమియు; కోరని = అడగని; వాఁడు = వాడు; కూటు = గుంపులు; జన సమ్మర్థము ఉన్న చోటులు; వలన్ = వలలో; కూడని = కలవని; వాఁడు = వాడు; వృథా = వ్యర్థముగ; ప్రపంచమున్ = ప్రాపంచిక విషయములను; చేరని = కూడని; వాఁడు = వాడు; దైవ = దైవము; గతిన్ = వలన; చేరిన = వచ్చినది; లాభమున్ = దొరికినది; సూచి = చూసి; తుష్టుఁడు = సంతృప్తితో కూడిన సంతోషము కలవాడు; ఐ = అయి; నేరని = చేతగాని; వాని = వాని; చందమునన్ = వలె ఉండి; నేర్పులు = తెలివి; సూపెడు = చూపు; వాఁడు = వాడు; వెండియున్ = ఇంకను.

భావము:

ఈయలేదని ఎవరినీ కోపంతో ఎగ్గులు పలకడు, కావాలని ఏ కోరికలూ కోరడు. ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోడు. వ్యర్థమైన ప్రపంచ విషయాల మీదికి మనస్సు పోనీయడు. దైవవశం వల్ల తనకు ప్రాప్తించిన దానితో సంతృప్తి చెంది ఏమీ ఎరుగని అమాయకునిలా కనబడుతాడు.