పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పరీక్షిత్తుని ప్రాయోపవేశంబు

  •  
  •  
  •  

1-516-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యుత్తరానందనుం డాడిన వచనంబులకు మును లందఱుఁ బ్రత్యుత్తరంబు విమర్శించు నెడ దైవయోగంబున.

టీకా:

అని = అని; ఉత్తరానందనుండు = పరీక్షిత్తు {ఉత్తరానందనుడు - ఉత్తర యొక్క కొడుకు, పరీక్షిత్తు}; ఆడిన = పలికిన; వచనంబులు = మాటలు; కున్ = కు; మునులు = మునులు; అందఱున్ = అందరును; ప్రతి = తిరుగు; ఉత్తరంబున్ = సమాధానమును; విమర్శించు = చర్చించుకొను; ఎడ = సమయమునకు; దైవ = దైవ; యోగంబునన్ = అనుగ్రహము వలన.

భావము:

అని పలుకుతున్న ఉత్తరానందనుని ప్రశ్నలకు సరియైన ప్రత్యుత్తరం కోసం సంయమీంద్రు లందరూ సమాలోచనలు జరుపుతున్నారు.