పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పరీక్షిత్తుని ప్రాయోపవేశంబు

  •  
  •  
  •  

1-511-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

""క్షితినాథోత్తమ! నీ చరిత్రము మహాచిత్రంబు; మీ తాత లు
గ్ర పోధన్యులు; విష్ణుపార్శ్వపదవిం గామించి రాజన్యశో
భి కోటీర మణిప్రభాన్విత మహాపీఠంబు వర్జించి రు
న్నతులై; నీవు మహోన్నతుండవు గదా నారాయణధ్యాయివై.

టీకా:

క్షితినాథోత్తమ = పరీక్షిన్మహారాజ {క్షితినాథోత్తముడు - భూమికి భర్తలలో శ్రేష్ఠుడు, పరీక్షిన్మహారాజు}; నీ = నీ; చరిత్రము = నడవడిక; మహా = గొప్ప; చిత్రంబు = ఆశ్చర్యకరమైనది; మీ = మీ; తాతలు = తాతలు; పూర్వులు; ఉగ్ర = ఉగ్రమైన; భీకరమైన; తపస్ = తపస్సు వలన; ధన్యులు = చరితార్థులు; విష్ణు = విష్ణువు; పార్శ్వ = ప్రక్కన ఉండుట అను; పదవిన్ = గొప్పస్థితిని; కామించి = కోరుకొని; రాజన్య = రాజుల యొక్క; శోభిత = శోభకలిగిన, ప్రకాశిస్తున్న; కోటిర = కిరీటముల; మణి = రత్నపు; ప్రభ = ప్రభలచే; కాంతులచే; ఆన్విత = కూడిన; మహా = గొప్ప; పీఠంబున్ = సింహాసనమును; వర్జించిరి = విడిచిపెట్టిరి; ఉన్నతులు = గొప్పవారు, శ్రేష్ఠులు; ఐ = అయి; నీవు = నీవు; మహా = మిక్కిలి; ఉన్నతుండవున్ = గొప్పవాడివి; కదా = కదా; నారాయణ = భగవంతుని; అధ్యాయివి = ధ్యానించువాడవు; ఐ = అయి.

భావము:

“రాజేంద్రా! నీ చరిత్రం చాలా చిత్రం. స్తుతిపాత్రం. మీ పూర్వీకులు మహా తపస్సంపన్నులు, వారు వాసుదేవుని సన్నిధిని వాంఛించి నానారాజ కిరీట రత్న రత్న ప్రభారాజితో విరాజిల్లే రాజపీఠాన్ని విసర్జించారు. వారే ఉన్నతు లనుకొంటే నారాయణ నామ పారాయణుడవైన నీవు వారి కంటె మహోన్నతుడవు.