పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పరీక్షిత్తుని ప్రాయోపవేశంబు

  •  
  •  
  •  

1-504-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పారు నహంకార
వ్యాపారము లందు మునిఁగి ర్తింపంగా
నాపాలిటి హరి భూసుర
శావ్యాజమున ముక్తసంగుం జేసెన్.

టీకా:

ఏపారు = అధికమైన; అహంకార = అహంకార పూరితములగు; వ్యాపారములు = ప్రవర్తనలు; అందున్ = లో; మునిఁగి = లీనమై; వర్తింపంగాన్ = తిరుగుచుండగ; నా = నా; పాలిటి = వంతుకి; వరకు; హరి = హరి; భూసుర = బ్రాహ్మణుని {భూసురుడు - భూమికి సురుడు (దేవుడు), బ్రాహ్మణుడు}; బ్రాహ్మణులు}; శాప = శాపము అను; వ్యాజమున = మిషచేత; ముక్త = విడిచిన; సంగున్ = బంధములు కలవాడు {ముక్తసంగుడు - ముక్త (విడువబడిన) సంగుడు (తగులములు కలవాడు)}; సంసారబంధనములు విడిచినవాడు}; చేసెన్ = చేసెను.

భావము:

అతిశయించిన అహంకారంతో కూడిన సంసార సాగరంలో మునిగి తేలుతున్న నాకు నా పాలిటి భగవంతుడు బ్రాహ్మణశాప మనే మిషతో విముక్తి ప్రసాదించాడు.