పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పరీక్షిత్తుని ప్రాయోపవేశంబు

  •  
  •  
  •  

1-503-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భీరతర సంసార
వ్యాకులతన్ విసిగి దేహ ర్జన గతి నా
లోకించు నాకుఁ దక్షక
కాకోదరవిషము ముక్తికారణ మయ్యెన్.

టీకా:

భీకరతర = మిక్కిలి భయంకరమైన {భీకరము - భీకరతరము - భీకరతమము}; సంసార = సంసారము వలన; వ్యాకులతన్ = చీకాకులతో; విసిగి = విసుగు చెంది; దేహ = శరీరమును; వర్జన = వర్జించు; గతి = మార్గము గురించి; ఆలోకించు = చూచుచున్న; నాకున్ = నాకు; తక్షక = తక్షకుడు అను; కాకోదర = పాము; విషము = విషము; ముక్తి = ముక్తికి; కారణము = కారణము; అయ్యెన్ = అయినది.

భావము:

మిక్కిలి భయంకరమైన సంసార పంకంలో చిక్కుకొని విసిగి వేసారి విడిచి పెడదామని ఆలోచిస్తున్న నాకు తక్షకుని మహావిషం మోక్షహేతువైంది.