పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పరీక్షిత్తుని ప్రాయోపవేశంబు

  •  
  •  
  •  

1-501-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

""పిక లేక చచ్చిన మహోరగముం గొని వచ్చి కోపినై
తాసు మూపుఁపై నిడిన దారుణచిత్తుఁడ; మత్తుఁడన్; మహా
పాపుఁడ; మీరు పాపతృణపావకు; లుత్తము లయ్యలార! నా
పాము వాయు మార్గముఁ గృపావరులార! విధించి చెప్పరే.

టీకా:

ఓపిక = ఓర్పు; లేక = నశించి; చచ్చిన = మరణించిన; మహా = పెద్ద; ఉరగమున్ = పామును; కొని = తీసికొని; వచ్చి = వచ్చి; కోపినై = కోపిష్టినై; తాపసు = మునియొక్క; మూపు = భుజముల; పైన్ = మీద; ఇడిన = వేసిన; దారుణ = భయంకరమైన; చిత్తుఁడన్ = మనసుకలవాడను; మత్తుఁడన్ = మదించినవాడను; మహా = గొప్ప; పాపుఁడన్ = పాపము చేసినవాడను; మీరు = మీరు; పాప = పాపము అను; తృణ = గడ్డిపోచకు; పావకులు = అగ్నివంటి వారు; ఉత్తములు = శ్రేష్ఠులు; అయ్యలార = తండ్రులారా; నా = నాయొక్క; పాపము = పాపము; పాయు = పోవు; మార్గమున్ = దారిని; కృపా = దయను; వరులార = ప్రసాదించు వారలారా; విధించి = నిర్ణయించి; చెప్పరే = చెప్పండి.

భావము:

“దయానిధులైన తపోధనులారా! నేను సహనం కోల్పోయి కోపాన్ని ఆపుకోలేక చచ్చిన సర్పాన్ని తెచ్చి మునీంద్రుని మూపుపై వేసిన పాపాత్ముణ్ణి, క్రూరచిత్తుణ్ణి; మీరు పాపారణ్య పావకులు, ఉత్తములు. సంయమసత్తములు. అయ్యలారా! నా పాపం పరిహార మయ్యే మార్గం సెలవీయండి.