పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పరీక్షిత్తుని ప్రాయోపవేశంబు

  •  
  •  
  •  

1-498-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చిత్తము గోవిందపదా
త్తముఁ గావించి, మౌనియై తనలో నే
త్తఱము లేక, భూవర
త్తముఁడు వసించె ముక్తసంగత్వమునన్.

టీకా:

చిత్తమున్ = మనసును; గోవింద = కృష్ణుని; పద = పదములందు; ఆయత్తమున్ = నిలువబడినదిగా; కావించి = చేసి; మౌని = మౌనము ధరించిన వాడు; ఐ = అయి; తన = తన; లోన్ = లో; ఏ = ఏ; తత్తఱము = కంగారు – తొట్రుపాటు; లేక = లేకుండగ; భూ = భూమికి; వర = భర్తలలో; సత్తముఁడు = ఉత్తముడు; వసించె = ఉండెను; ముక్త = విడిచిన; సంగత్వమునన్ = సమస్త బంధనములతో {సంగత్వము - సంగములు (తగులములు) కల స్థితి}; సమస్త బంధనములు}.

భావము:

ఆ రాజసత్తముడు తన చిత్తాన్ని గోవింద పదాయత్తం చేసి సర్వసంగ పరిత్యాగియై ఎటువంటి మనోవైకల్యం లేకాండా మౌనంగా కూర్చున్నాడు.