పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : శృంగి శాపంబు

  •  
  •  
  •  

1-487-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పొడిచినఁ, దిట్టినఁ, గొట్టినఁ,
డుచుందురు గాని పరమభాగవతులు; దా
రొడఁబడరు మాఱు సేయఁగఁ
గొడుకా! విభుఁ డెగ్గు సేయఁ గోరఁడు నీకున్.

టీకా:

పొడిచినన్ = పొడిచినను; తిట్టినన్ = తిట్టినను; కొట్టినన్ = కొట్టినను; పడుచున్ = పడుతు; ఉందురు = ఉంటారు; కాని = కాని; పరమ = ఉత్కృష్టమైన; భాగవతులు = భాగవతానుయాయులు - భాగవతులు; తారు = తాము; ఒడఁబడరు = సిద్ధపడరు; మాఱు = ప్రతీకారము; సేయఁగన్ = చేయుటకు; కొడుకా = పుత్రా; విభుఁడు = ప్రభువు; ఎగ్గు = కీడు; సేయన్ = చేయుటను; కోరఁడు = కోరుకొనడు; నీకున్ = నీకు.

భావము:

కుమార! కొట్టినా తిట్టినా పరమభక్తులైన వారు, పరమభాగవతులు శాంతంతో భరిస్తారే తప్ప ప్రతీకారం చెయ్యటానికి అంగీకరించరు. మన మహారాజు నీకు కీడు చేయాలనుకొనడు.
శమీకమహర్షి తన మెడలో పరీక్షిత్తు వేసిన చచ్చిన పామును తొలగించి, శపించిన తన పుత్రుడు శృంగికి ఇలా బుద్ధి చెప్పసాగాడు. పరమభాగవతుల తత్వం నిర్వచించిన మహా అద్భుత పద్య మిది.