పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : శృంగి శాపంబు

  •  
  •  
  •  

1-485-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భాతవంశజుం, బరమభాగవతున్, హయమేధయాజి, నా
చాపరున్, మహానయవిశారదు, రాజకులైకభూషణున్,
నీము గోరి నేఁడు మన నేలకు వచ్చిన;యర్థి భక్తి స
త్కాము సేసి పంపఁ జనుఁ గాక శపింపఁగ నీకు ధర్మమే?

టీకా:

భారత = భరతుని; వంశజున్ = వంశము నందు పుట్టినవాని; పరమ = ఉత్కృష్టమైన; భాగవతున్ = భాగవత మార్గానుయాయిని; భాగవతుని; హయ = అశ్వ; మేధ = మేధ; యాజి = యజ్ఞము చేసినవానిని; ఆచారపరున్ = ఆచారవంతుని; మహా = గొప్ప; నయ = నీతికల; విశారదున్ = నేర్పరిని; రాజ = రాజుల; కుల = సమూహమునకు; ఏక = ముఖ్యమైన; భూషణున్ = ఆభరణము వంటివానిని; నీరము = నీరు; కోరి = కోరి; నేఁడు = ఇవేళ; మన = మన యొక్క; నేల = ప్రదేశమున; కున్ = కు; వచ్చిన = వచ్చిన; అర్థిన్ = అర్థించువానిని; భక్తి = భక్తితో; సత్కారము = గౌరవము; చేసి = చేసి; పంపన్ = పంపుట; చనున్ = తగును; కాక = అంతే కాని; శపింపఁగన్ = శపించుట; నీకు = నీకు; ధర్మమే = ధర్మమా ఏమిటి.

భావము:

పవిత్రమైన భారతదేశంలో జన్నించాడు. పరమ భాగవతుడని పేరుగాంచాడు. అశ్వమేధం ఆచరించాడు. సదాచారసంపన్నుడూ, రాజనీతిజ్ఞడూ, రాజకులాలంకారుడూ అయిన అంతటి మహారాజు దాహమై మన తపోవనానికి వస్తే ఆదరంతో అతిథిసత్కారాలు ఆచరించి పంపాలి. అంతే కాని, ఇలా శపించటం ఏమి ధర్మమయ్యా?