పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : శృంగి శాపంబు

  •  
  •  
  •  

1-483-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కారి లేని గొఱ్ఱియల కైవడిఁ గంటక చోర కోటిచే
నేఱి యున్నదీ భువన మీశుఁడు గృష్ణుఁడు లేమి నిట్టిచో,
భూరిపాలనంబు సమబుద్ధి నితం డొనరింపఁ, జెల్లరే!
యీ రిపాటి ద్రోహమున కిట్లు శపింపఁగ నేల? బాలకా!

టీకా:

కాపరి = కాపలా కాసేవాడు; లేని = లేని; గొఱ్ఱియల = గొఱ్ఱెల; కైవడిన్ = వలె; కంటక = దుష్టులు; చోర = దొంగలు; కోటి = పెద్ద సమూహము; చేన్ = చేత; ఏపు = అభివృద్ధి - బలము; అఱి = చెడి - లేక; ఉన్నది = ఉన్నది; ఈ = ఈ; భువనము = లోకము; ఈశుఁడు = ఈశ్వరుడు; కృష్ణుఁడు = కృష్ణుడు; లేమిన్ = లేకపోవుటచేత; ఇట్టిచో = ఈ విధముగ అయినచో; భూ = భూమిని; పరిపాలనంబు = ఏలుట; సమ = సమన్వయమగు; బుద్ధిన్ = బుద్ధితో; ఇతండు = ఇతడు; ఒనరింపన్ = చేయుచుండగ; చెల్లరే = తగునా ఏమి; చెల్లునా ఏమి; ఈ పరిపాటి = ఇంత చిన్న; ద్రోహము = అపరాధము, కీడు; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; శపింపఁగ = శపించుట; ఏల = ఎందుకు; బాలకా = పిల్లవాడా.

భావము:

వాసుదేవుడు లేకపోవటం మూలాన లోకమంతా చీకాకు పాలైంది. ప్రజలు కాపరిలేని గొఱ్ఱెల్లాగా ఆపద పాలయ్యారు. దొంగలూ దుండగులూ పెచ్చరిల్లారు. ఇటువంటి క్లిష్ట సమయంలో మన మహారాజు సమదృష్టితో సమర్థంగా ప్రజలను పాలిస్తున్నాడు. అయ్యో ఈ రవ్వంత అపరాధానికి ఇలా రాజును ఎందుకు శపించావు నాయనా?