పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : శృంగి శాపంబు

  •  
  •  
  •  

1-482-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ల్లి కడుపులోన గ్ధుడై క్రమ్మఱఁ
మలనాభు కరుణఁ లిగినాఁడు;
లిమి గలిగి ప్రజలఁ బాలించుచున్నాడు;
దిట్టవడుగ! రాజుఁ దిట్టఁ దగునె?

టీకా:

తల్లి = తల్లి; కడుపు = గర్భము; లోన = లోపల; ధగ్దుఁడు = కాలిన వాడు; ఐ = అయి; క్రమ్మఱన్ = మరల; కమలనాభుడు = కృష్ణుని {కమలనాభుడు - కమల (పద్మము) నాభుడు (నాభి యందు కలవాడు), విష్ణువు}; కరుణన్ = కరుణతో; కలిగినాఁడు = బ్రతికినవాడు; బలిమిన్ = బలము - శక్తి; కలిగి = కలిగి ఉండి; ప్రజలన్ = జనులను; పాలించుచున్ = ఏలుచు; ఉన్నాడు = ఉన్నాడు; దిట్ట = సామర్థ్యము గల; వడుగ = ఓ బ్రహ్మచారీ; రాజున్ = రాజును; తిట్టన్ = తిట్టుట; తగునె = తగునా ఏమి, సరియైనదా ఏమి.

భావము:

పాపం! పరీక్షిత్తు తల్లి గర్భంలోనే దగ్ధుడైనాడు. మళ్ళీ శ్రీకృష్ణుని కటాక్షం వల్ల బ్రతికి బయటపడ్డాడు. ఇప్పుడు పెరిగి పెద్దవాడై పరాక్రమవంతుడై ప్రజలను పరిపాలిస్తున్నాడు. ఓ బ్రహ్మచారీ! అటువంటి మంచిరాజును శపించవచ్చా?