పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : శృంగి శాపంబు

  •  
  •  
  •  

1-481-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

""బెట్టిదమగు శాపమునకు
ట్టపు ద్రోహంబు గాదు, రణీకాంతుం
ట్టా! యేల శపించితి
ట్టీ! తక్షకవిషాగ్ని పాలగు మనుచున్.

టీకా:

బెట్టిదము = కఠినము; అగు = అయిన; శాపము = శాపము; కున్ = కు; దట్టపు = బలమగు; ద్రోహంబున్ = ద్రోహము; కాదు = కాదు; ధరణీ = భూమికి; కాంతున్ = భర్తని - రాజును; కట్టా = అయ్యో; ఏల = ఎందుకు; శపించితి = శపించితివి; పట్టీ = పుత్రా; తక్షక = తక్షకుడు అను; విష = విషము యొక్క; అగ్ని = అగ్నికి; పాలు = వశము; అగుము = అవ్వుము; అనుచున్ = అని.

భావము:

“నాయనా! ఇంతటి కఠోరమైన శాపం పెట్టటానికి అంతటి మహాపరాధం ఆ మహారాజు ఏంచేసాడు. తక్షకవిషాగ్ని జ్వాలల పాలు కమ్మని ఆ ధరణీపాలుణ్ణి, అయ్యయ్యో! ఎందుకు శపించావు?