పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : శృంగి శాపంబు

  •  
  •  
  •  

1-480-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యడిగినఁ దండ్రికిఁ గొడుకు, రాజు వచ్చి సర్పంబు వైచుటయుం దాను శపించుటయును వినిపించిన, నమ్ముని తన దివ్యజ్ఞానంబున నమ్మానవేంద్రుండు పరీక్షిన్నరేంద్రుం డని యెఱింగి, కొడుకువలన సంతసింపక యిట్లనియె.

టీకా:

అని = అని; అడిగినన్ = అడుగగా; తండ్రి = తండ్రి; కిన్ = కి; కొడుకు = కుమారుడు; రాజు = రాజు; వచ్చి = వచ్చి; సర్పంబున్ = పామును; వైచుటయున్ = వేసుటయును; తాను = తాను; శపించుటయును = శపించుటయును; వినిపించిన = వినిపించిన; ఆ = ఆ; ముని = ముని; తన = తన యొక్క; దివ్య = దివ్యమైన; జ్ఞానంబున = జ్ఞానము వలన; ఆ = ఆ; మానవ = మానవులలో; ఇంద్రుండు = శ్రేష్ఠుడు; పరీక్షిన్నరేంద్రుండు = పరీక్షిన్మహారాజు; అని = అని; ఎఱింగి = తెలిసికొని; కొడుకు = కుమారుని; వలనన్ = వలన; సంతసింపక = ఇష్టపడక; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అని (శమీకుడు) ప్రశ్నించాడు. అప్పుడు శృంగి రాజు వచ్చి పామును వేయటం, ఆ రాజును తాను శపించటం తన తండ్రికి విన్నవించాడు. వెంటనే శమీకమహర్షి తన దివ్యదృష్టితో ఆ రాజు పరీక్షిన్నరేంద్రుడని తెలుసుకొని కొడుకు చేసిన పనికి సంతోషింపక ఇలా అన్నాడు-