పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : శృంగి శాపంబు

  •  
  •  
  •  

1-479-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

""ఏ కీడు నాచరింపము
లోకులకున్ మనము సర్వలోక సములమున్
శోకింప నేల పుత్రక
కాకోదర మేల వచ్చెఁ? గంఠంబునకున్.""

టీకా:

ఏ = ఏ; కీడున్ = కీడు, అపకారమును; ఆచరింపము = కలుగజేయము; లోకులు = జనులు; కున్ = కు; మనము = మనము; సర్వ = సమస్త; లోక = లోకులను; సములమున్ = సమానముగా చూచు వారము; శోకింపన్ = ఏడ్చుట; ఏల = ఎందుకు; పుత్రక = కుమారా; కాకోదరము = పాము; ఏల = ఎందుకు; వచ్చెన్ = వచ్చెను; కంఠంబు = మెడమీద; కున్ = కు.

భావము:

""నాయనా! మనం లోకంలో ఎవరికి ఎలాంటి అపకారము చేసేవాళ్ళం కాదు కదా. మనం, లోకంలో అందరిని సమానంగానే చూస్తాం కదా. అయినా, నా మెడలోకి ఈ పాము ఎలా వచ్చింది? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు?""
అని తండ్రి యైన శమీక మహర్షి పరీక్షితుని శపించిన శృంగిని అడిగాడు.