పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పరీక్షిత్తు వేటాడుట

  •  
  •  
  •  

1-468-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

""డు తన్ను దూషణము, లాశ్రమవాసులఁ గాని వైరులం
గూడఁడు, కందమూలములు గూడుగఁ దించు సమాధినిష్ఠుఁడై
వీడఁడు లోనిచూడ్కులను, విష్ణునిఁ దక్కఁ బరప్రపంచముం
జూడఁడు, మద్గురుండు, ఫణిఁ జుట్టఁగ నేటికి రాచవానికిన్?

టీకా:

ఆడడు = పలుకడు; తన్నున్ = తనను; దూషణములు = నిందలు; ఆశ్రమ = ఆశ్రమములో; వాసులన్ = వసించువారిని; కాని = తప్ప; వైరులన్ = శత్రువులను; కూడఁడు = కలవడు; కంద = కంద; మూలములు = మొదలగునవి (దుంపలు); కూడుగన్ = భోజనముగ; తించు = తినుచు; సమాధి = సమాధిలో; నిష్ఠుఁడు = నిమగ్నమైనవాడు; ఐ = అయి; వీడఁడు = వదలడు; లోని = (ఆత్మ) లోపలి; చూడ్కులను = చూపులను; విష్ణునిన్ = విష్ణుమూర్తిని; తక్కన్ = కాని; పర = ఇతరమైన; ప్రపంచమున్ = ప్రపంచార్థములను; చూడఁడు = చూడడు; మత్ = నా యొక్క; గురుండు = తండ్రి; ఫణిన్ = పామును; చుట్టఁగన్ = చుట్టుట; ఏటి = ఎందుల; కిన్ = కు; రాచ = రాజకులపు – క్షత్రియకులపు; వాడు = వాడు; కిన్ = కి.

భావము:

""మా తండ్రి తనను తూలనాడలేదే ఆశ్రమవాసులతోనే గాని తమ శత్రు రాజులతో కూడలేదే అడవిలో కందమూలాలు భుజిస్తూ అచంచల మనస్కుడై అంతర్ దృష్టిని వీడకుండా, విష్ణుమూర్తిని తప్ప ఇతర ప్రపంచాన్ని చూడకుండా, తపోనిష్ఠలో ఉన్న ఆయన మీద ఆ రాచవాడు పామును వేసిపోతాడా?