పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పరీక్షిత్తు వేటాడుట

  •  
  •  
  •  

1-461-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని భూవరుండు శమీకమహాముని సమాధినిష్ఠానిమీలితనేత్రుండును విస్మృతబాహ్యాంతరింద్రియకృతసంచారుండును హరిచింతాపరుండునునై యుండుటం దెలియలేక.

టీకా:

అని = అని; భూవరుండు = రాజు, పరీక్షితు {భూవరుడు - భూమికిభర్త, రాజు}; శమీక = శమీకుడు అను; మహా = గొప్ప; ముని = ముని; సమాధి = సమాధి; నిష్ఠా = నియమానుసారము; నిమీలిత = మూసిన; నేత్రుండును = కళ్ళు కలవాడును; విస్మృత = మరచిన; బాహ్య = వెలుపలి; అంతర = లోపలి; ఇంద్రియ = ఇంద్రియములచే; కృత = చేయబడిన, చేసిన; సంచారుండును = కదలికలు ఉన్నవాడు; హరి = హరి యొక్క; చింతా = ధ్యానమున; పరుండును = నిమగ్నుడును; ఐ = అయి; ఉండుటన్ = ఉండుటను; తెలియన్ = తెలుసికొన; లేక = లేక.

భావము:

ఆ ముని మాట్లాడలేదు. ఆ మునీంద్రుడు నిమీలితనేత్రుడై, సమాధిస్థుడై బాహ్యేంద్రియజ్ఞానం లేక హరి చింతా పరతంత్రుడై ఉన్నాడని మహారాజు తెలుసుకోలేక ....