పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పరీక్షిత్తు వేటాడుట

  •  
  •  
  •  

1-458-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు వాటంబయిన వేఁటతమకంబున మృగంబుల వెంబడిం బడి యెగచుచుం జరించుటంజేసి బుభుక్షా పిపాసల వలన మిగుల బరిశ్రాంతుండయి, ధరణీకాంతుండు చల్లని నీటి కొలంకుం గానక కలంగెడు చిత్తంబుతోఁ జని, యొక్క తపోవనంబు గని; యందు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; వాటంబు = కౌతుక సహితము; వాడిది; అయిన = అయినట్టి; వేఁట = వేటమీది; తమకంబున = పరవశత్వముతో; మృగంబులన్ = జంతువులను; వెంబడిన్ = వెనకాతల; పడి = పడి; ఎగచుచున్ = తరుముతూ; చరించుటన్ = తిరుగుట; చేసి = వలన; బుభుక్షా = ఆకలియును; పిపాసల = దాహముల; వలనన్ = వలన; మిగులన్ = మిక్కిలి; పరిశ్రాంతుండు = అలసినవాడు; అయి = అయి; ధరణీకాంతుండు = రాజు, పరీక్షిత్తు {ధరణీకాంతుండు - భూమికిభర్త - రాజు, పరీక్షిత్తు}; చల్లని = చల్లని; నీటి = నీటి; కొలంకున్ = కొలనును - చెరువును; కానక = కనుగొన లేక; కలంగెడు = కలత పడిన; చిత్తంబు = మనసు; తోన్ = తో; చని = వెళ్ళి; ఒక్క = ఒక; తపస్ = తపస్సు చేసుకొను; వనంబున్ = వనమును; కని = చూసి - కనుగొని; అందున్ = అందులో.

భావము:

ఈ విధంగా మృగయాకౌతుకంతో మృగాల వెంటబడి తరుమూతూ పరుగులెత్తటం మూలాన ఆకలి దప్పుల వల్ల అలసి పోయాడు మహారాజు, పరిశ్రాంతుడైన ఆ భూకాంతుడు చల్లని జలాశయం కోసం వెదకి వేసారి ఒక తపోవనాన్ని ప్రవేశించాడు.