పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పరీక్షిత్తు వేటాడుట

  •  
  •  
  •  

1-455-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గ్గములు ద్రవ్వి పడు మని
యొగ్గెడు పెనుదెరల, వలల, నురలు మృగములన్
గ్గఱి చంపెడు వేడుక
వెగ్గలమై చిత్తమందు వేఁటాడింపన్.

టీకా:

ఒగ్గములున్ = అవపాతములు {ఒగ్గములు - అవపాతములు - ఏనుగులు మొదలగునవి పడుటకు పైన కఱ్ఱలు కంపలు కప్పి లోపల వెలితిగ నుండు గోతులు}; త్రవ్వి = తవ్వి; పడుము = పడుము; అని = అని; ఒగ్గెడు = పరిచిన; పెను = పెద్ద; తెరలన్ = తెరలును; వలలన్ = వలలును; ఉరలున్ = ఉచ్చులుతోను; మృగములన్ = జంతువులను; డగ్గఱి = దగ్గరకు వెళ్ళి; చంపెడు = చంపవలెననే; వేడుక = కోరిక; వెగ్గలము = అధికము; ఎక్కువ; ఐ = అయి; చిత్తము = మనసు; అందున్ = లో; వేఁటాడింపన్ = వెంటాడగా.

భావము:

లోత్తైన కందకాలు త్రవ్వీ, పెద్ద పెద్ద వలలు పరచీ, ఉచ్చులు పన్నీ మృగాలనూ, పక్షులనూ పట్టుకొని బంధించే ఉత్సాహంతో అరణ్యమంతా విచ్చలవిడిగా తిరిగాడు.