పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ధరణీ ధర్మదేవత లుద్ధరణంబు

  •  
  •  
  •  

1-452.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నే మహాత్ము నాశ్రయించి శరీరాది
సంగకోటి నెల్ల సంహరించి
ప్రాభవమున మునులు పారమ హంస్యంబు
నొంది తిరిగి రాక యుందు రెలమి?

టీకా:

ఎవ్వని = ఎవ్వాని; గుణ = గుణముల; జాలము = సమూహము; ఎన్నన్ = ఎన్నుటకు; జిహ్వలు = నాలుకలు; లేక = లేక; నలిన = పద్మము అను; గర్భ = గర్భములో పుట్టినవాడు, బ్రహ్మ; ఆదులు = మొదలగు వారు; అనంతుఁడు = అంతము లేని వాడు; అండ్రు = అందురు; కోరెడు = కోరుచున్న; విబుధ = మిక్కిలి బుద్ధిమంతులలో; ఇంద్ర = ఉత్తముల; కోటిన్ = కోటిమందిని, సమూహమును; ఒల్లక = ఒప్పుకొనక; లక్ష్మి = లక్ష్మీదేవి; ప్రార్థించెన్ = ప్రార్థించెను; ఎవ్వని = ఎవ్వని; పాద = పాదముల; రజము = రజము – ధూళి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఎవ్వని = ఎవ్వని; పాద = పాదములు అను; పద్మంబు = పద్మములు; కడిగిన = కడిగిన; జలము = జలమును; ధన్యతన్ = ధన్యతతో, పుణ్యముతో; ఇచ్చెన్ = ఇచ్చెను; జనులు = మానవులు; కున్ = కు; ఎల్లన్ = అందరికి; భగవంతుఁడు = భగవంతుడు; అనియెడి = అనెడి; భద్ర = శుభమైన, క్షేమకరమైన; శబ్దము = పేరు; కున్ = కు; ఎవ్వఁడు = ఎవ్వడు; అర్థ = అర్థముయొక్క; ఆకృతిన్ = ఆకారమునకు; ఏపు = అతిశయించి; మిగులున్ = ఉండును; ఏ = ఏ;
మహా = గొప్ప; ఆత్మున్ = ఆత్మకలవానిని; ఆశ్రయించి = ఆశ్రయించి; శరీర = శరీరము; ఆది = మొదలగు; సంగ = బంధముల; కోటి = పెద్ద సమూహమును; ఎల్లన్ = అంతటిని; సంహరించి = అణిచివేసి; ప్రాభవమునన్ = ప్రాభవముతో; మునులు = మునులు; పారమ హంస్యంబున్ = పరమహంసత్వమును, ముక్తిని; ఒంది = పొంది; తిరిగి = తిరిగి; రాక = రాకుండగ; ఉందురు = ఉందురు; ఎలమిన్ = వికసించి.

భావము:

ఏ దేవుని గుణగణాలను గణించటానికి నాలుకలు చాలక పద్మగర్భాది దేవతలు అనంత గుణవంతుడని అంటారో, తనను వాంఛించే తక్కిన ముక్కోటి దేవతలనూ తిరిస్కరించి శ్రీదేవి ఎవని పాద పరాగాన్ని స్వీకరించిందో, బ్రహ్మదేవుడు ఏ పాదపద్మాలు కడిగి ఆ పవిత్రగంగను అఖిలజగతికి అనుగ్రహించాడో, భగవంతుడు అనే పరమ పవిత్ర శబ్దానికి అర్థంగా ఏ దేవుని స్వరూపం విరాజిల్లుతున్నదో, ఏ దేవుని ఆశ్రయించి మహామునులు నిస్సంగులై తిరిగిరాని పరమహంస పదాన్ని అందుకొన్నారో,
ఆ వాసుదేవుని దివ్యగాథలు సమగ్రంగా గుర్తించి తెలుసుకోవటానికి ఎవరికి సాధ్యమౌతుంది?