పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ధరణీ ధర్మదేవత లుద్ధరణంబు

  •  
  •  
  •  

1-448-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రమ భాగవతుఁడు పాండవపౌత్రుండు
శుకుని భాషణముల శుద్ధబుద్ధి
యై విరాజమానుఁడై ముక్తి యగు విష్ణు
పాదమూల మెట్లు డసె ననఘ!

టీకా:

పరమ = ఉత్కృష్టమైన; భాగవతుఁడు = భాగవత ధర్మము కలవాడు; పాండవపౌత్రుండు = పరీక్షిత్తు {పాండవపౌత్రుడు - పాండవుల యొక్క మనుమడు, పరీక్షిన్మహారాజు}; శుకుని = శుకుని యొక్క; భాషణములన్ = ప్రవచనముల వలన; శుద్ధ = శుద్ధి చేయబడిన; బుద్ధి = బుద్ధి కలవాడు; ఐ = అయి; విరాజ = వెలుగొందుచున్న; మానుఁడు = మానసము కలవాడు; ఐ = అయి; ముక్తి = తామే ముక్తి; అగు = అయినట్టి; విష్ణు = విష్ణుదేవుని; పాదమూలము = చరణములు; ఎట్లు = ఏ విధముగ; వడసెన్ = పొందెను; అనఘ = పాపములేనివాడా.

భావము:

పరమ భాగవతాగ్రేసరుడూ, పాండవ పౌత్రుడూ, సద్గుణ సాంద్రుడూ అయిన పరీక్షిన్నంద్రుడు శుకమహర్షి సూక్తులు ఆలకించి పరిశుద్ధమైన పరమార్థబుద్ధితో తేజరిల్లుతూ ముక్తికి ఆలవాలమైన వాసుదేవుని పాదమూలాన్ని ఎలా పొందాడు.