పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ధరణీ ధర్మదేవత లుద్ధరణంబు

  •  
  •  
  •  

1-445-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

""పౌరాణికోత్తమ! బ్రతుకుము పెక్కేండ్లు-
తామరసాక్షుని వళయశము
రణశీలురమైన మా కెఱింగించితి-
ల్పితంబగు క్రతుర్మమందుఁ
బొగలచేఁ బొగిలి యబుద్దచిత్తులమైన-
ము హరి పదపద్మ ధుర రసమున్
ద్రావించితివి నీవు న్యులమైతిమి-
స్వర్గమేనియు నపర్గమేని

1-445.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భాగవత సంగ లవ భాగ్యలము కీడె?
ప్రకృతిగుణహీనుఁడగు చక్రి ద్రగుణము
లీశ కమలాసనాదులు నెఱుగఁ లేరు
వినియు వినఁజాల ననియెడి వెఱ్ఱి గలఁడె?

టీకా:

పౌరాణిక = పురాణములు తెలుపు వారిలో; ఉత్తమ = ఉత్తముడా, సూతుడా; బ్రతుకుము = జీవించుము; పెక్కు = చాలా; ఏండ్లు = సంవత్సరములు; తామరసాక్షుని = కృష్ణని {తామరసాక్షుని - పద్మములవంటి కన్నులున్నవాడు, కృష్ణడు}; ధవళ = స్వచ్ఛమైన; యశము = కీర్తి; మరణ = మరణము; శీలురము = లక్షణము కలవారము; ఐన = అయిన; మాకు = మాకు; ఎఱింగించితి = తెలియజేసితివి; కల్పితంబు = సంకల్పితమైనది; అగు = అయినట్టి; క్రతు = యజ్ఞ; కర్మము = కర్మము; అందున్ = లోపల; పొగల = పొగల; చేన్ = తో; పొగిలి = మసిబారి; అబుద్ద = తెలివిలేని; చిత్తులము = మనసుకలవారము; ఐన = అయిన; మము = మమ్ములను; హరి = హరియొక్క; పద = పాదములను; పద్మ = పద్మముల; మధుర = తీయని; రసమున్ = రసము; త్రావించితివి = త్రాగునట్లు చేసితివి; నీవు = నీవు; ధన్యులము = ధన్యత పొందిన వారిమి; ఐతిమి = అయినాము; స్వర్గము = స్వర్గము; ఏనియున్ = అయినను; అపవర్గము = ముక్తి; ఏని = అయినను;
భాగవత = భాగవతముతో; సంగ = సంబంధముయొక్క; లవ = కొంచెము, పిసరు; భాగ్య = అదృష్టము యొక్క; ఫలము = ఫలితము; కున్ = కు; ఈడె = సమానమా ఏమి; ప్రకృతి = ప్రకృతి యందలి; గుణ = గుణములు – త్రిగుణములు; హీనుఁడు = లేనివాడు; అగు = అయినట్టి; చక్రి = హరి {చక్రి - చక్రాయుధుడు, విష్ణువు}; భద్ర = శుభ; గుణములు = గుణములు; ఈశ = ఈశుడు, శివుడు; కమలాసన = బ్రహ్మ {కమలాసన - పద్మము ఆసనముగ కలవాడు, బ్రహ్మ}; ఆదులున్ = మొదలగువారు కూడ; ఎఱుగఁన్ = తెలియ; లేరు = లేరు; వినియున్ = వినినప్పటికిని; వినజాలన్ = వినలేను; అనియెడి = అనెడి; వెఱ్ఱి = వెఱ్ఱివాడు; కలఁడె = కలడాఏమి.

భావము:

“పౌరాణిక శిరోమణీ! నీవు చిరకాలం వర్ధిల్లు. మరణశీలురమైన మాకు అమృతమయమైన హరి లీలావిశేషాలు వినిపించావు. బరువైన ఈ యజ్ఞకార్యం ఆరంభించి హోమధూమాలతో పొగచూరి పోయిన మా హృదయాలకు గోవించ చరణారవింద మధురమకరందాన్ని తనివితీరా త్రాగించావు. ధన్యులమైనాము. స్వర్గమే కాదు. అపవర్గం కూడా భగవద్భక్తుల సాంగత్య ఫలంలో పిసంరతకు కూడా సాటి రాదు కదా! ప్రాకృత గుణాతీతుడైన వాసుదేవుని కల్యాణ గుణవిశేషాలు తెలుసుకోవటం భవునకూ పద్మభవునకూ కూడా సాధ్యం కాదు. అటువంటి భగవంతుని పవిత్రగాథలు వీనులవిందుగా వింటూ, "చాలు, ఇంక వినలేను" అనెడి వెఱ్ఱివాళ్లు ఎక్కడైనా ఉంటారా?