పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ధరణీ ధర్మదేవత లుద్ధరణంబు

  •  
  •  
  •  

1-442-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇవ్విధంబునఁ జతుస్సముద్రముద్రితాఖిలమహీమండలప్రాజ్య సామ్రాజ్యంబు పూజ్యంబుగాఁ జేయుచు నా యభిమన్యుసంభవుండు

టీకా:

ఈ = ఈ; విధంబునన్ = విధముగా; చతుస్ = నాలుగు (4); సముద్ర = సముద్రముల చేతను; ముద్రిత = చుట్టబడిన; అఖిల = సమస్తమైన; మహీ = భూమి యొక్క; మండల = మండలము కల; ప్రాజ్య = విస్తారమైన; సామ్రాజ్యంబు = సామ్రాజ్యమును; పూజ్యంబుగాన్ = పూజనీయముగా; చేయుచున్ = పాలించుచు; ఆ = ఆ; అభిమన్యుసంభవుండు = పరీక్షిన్మహారాజు {అభిమన్యుసంభవుండు - అభిమన్యుని పుత్రుడు, పరీక్షిన్మహారాజు.}.

భావము:

ఈ ప్రకారంగా నాలుగు సముద్రాల నడుమ ఉన్న విస్తారమైన భూమండలాన్ని ఏకచ్ఛత్రాధిపతిగా ప్రజారంజకంగా పరిపాలించాడు ఆ అభిమన్యుని పుత్రుడైన పరీక్షిన్నరేంద్రుడు.