పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ధరణీ ధర్మదేవత లుద్ధరణంబు

  •  
  •  
  •  

1-441-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శుచరితుఁడు హరి యరిగినఁ
బ్రవించి ధరిత్రి నెల్లఁ బ్రబ్బియుఁ గలి దా
భిమన్యుసుతుని వేళను
బ్రవింపక యడఁగి యుండె భార్గవముఖ్యా!

టీకా:

శుభ = శుభకరమైన; చరితుఁడు = నడవడిక కలవాడు; హరి = హరి; అరిగినన్ = చనగా; ప్రభవించి = పుట్టి, రెచ్చిపోయి; ధరిత్రిన్ = భూమిని; ఎల్లన్ = అంతటి యందు; ప్రబ్బియున్ = అతిశయించియు, వ్యాపించియు; కలి = కలి; తాన్ = తాను; అభిమన్యు = అభిమన్యుని; సుతుని = పుత్రుని; పరీక్షితుని; వేళను = కాలములో; ప్రభవింపక = అతిశయింపక; అడఁగి = అణగి; ఉండెన్ = ఉండెను; భార్గవముఖ్యా = శౌనక మహర్షీ {భార్గవముఖ్యుడు - భృగువు వంశంలో ముఖ్యుడు, శౌనక మహర్షీ.}.

భావము:

పుణ్యచరిత్రుడైన పురుషోత్తముడు అవతారం చాలించిన అనంతరం కలి లోకమంతా వ్యాపించి విజృంభించాడు; కానీ అభిమన్యనందనుడైన పరీక్షిత్తు కాలంలో తలవంచి అణగిమణగి ఉన్నాడు.