పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ధరణీ ధర్మదేవత లుద్ధరణంబు

  •  
  •  
  •  

1-440-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రివార్త లెఱుఁగువారికి
రిపదములు దలఁచువారి నవరతంబున్
రికథలు వినెడివారికి
ణాగతమోహసంభ్రము లే దనఘా!

టీకా:

హరి = హరి యొక్క; వార్తలు = విశేషములు; ఎఱుఁగు = తెలియు; వారు = వారు; కిన్ = కి; హరి = హరి యొక్క; పదములు = పాదములు; తలఁచు = స్మరించు; వారు = వారు; కిన్ = కి; అనవరతంబున్ = ఎడతెగక; హరి = హరి యొక్క; కథలు = కథలు; వినెడి = వినుచుండు; వారు = వారు; కిన్ = కి; మరణ = మృత్యువు; ఆగత = పొందుట వలన; మోహ = భ్రాంతి; సంభ్రమమున్ = భయము; లేదు = లేదు; అనఘా = పాపము లేనివాడా.

భావము:

పవిత్ర చరిత్రా! హరి లీలలు అర్థం చేసుకొనేవారూ, హరి చరిత్రలు ఆలకించేవారూ, హరి చరణాల స్మరణం చేసుకోనేవారూ మరణ సమయంలో కూడా ఎటువంటి వేదనా, ఆవేదనా, తొందరపాటూ, తొట్రుపాటూ పొందరయ్యా!