పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కలి నిగ్రహంబు

  •  
  •  
  •  

1-434-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

""అర్జునకీర్తిసమేతుం,
ర్జునపౌత్రుండు, భయర సావృత జనులన్
నిర్జితులఁ జంప నొల్లడు;
దుర్జనభావంబు విడిచి తొలఁగు దురాత్మా!

టీకా:

అర్జున = స్వచ్ఛమైన; కీర్తి = కీర్తి; సమేతుండు = కలిగినవాడు; అర్జున = అర్జునుని; పౌత్రుండు = మనుమడు; భయ = భయము అను; రస = రసముతో; ఆవృత = ఆవరించిన; జనులన్ = మానవులను; నిర్జితులన్ = జయములేని వారిని, ఓడినవారిని; చంపన్ = చంపుటకు; ఒల్లడు = ఒప్పుకొనడు; దుర్జన = చెడ్డవారి; భావంబున్ = భావమును; విడిచి = వదలి; తొలఁగు = దూరముగ పొమ్ము; దురాత్మా = చెడ్డ స్వభావము కలవాడా.

భావము:

“ఓయీ! అత్యంత నిర్మలయశోవిశాలుడైన అర్జునుని అనుగు మనుమడు ఓడి, ధైర్యం వీడి, దోసిలొగ్గిన వారిని వధింపడు. ఇక నీ ధూర్తస్వభావాన్ని విడిచి దూరంగా తొలగిపో దుర్మార్గుడా!