పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కలి నిగ్రహంబు

  •  
  •  
  •  

1-425-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దుష్టజననిగ్రహంబును
శిష్టజనానుగ్రహంబుఁ జేయఁగ నృపులన్
స్రష్ట విధించెఁ, బురాణ
ద్రష్టలు సెప్పుదురు పరమర్మము సాధ్వీ!""

టీకా:

దుష్ట = దుష్టులైన – చెడ్డవారైన; జన = ప్రజలను; నిగ్రహంబును = అదుపులోపెట్టుటయు – శిక్షించుటయు; శిష్జ = శిష్టులైన – మంచివారైన; జన = ప్రజలను; అనుగ్రహంబున్ = పాలించుటయు, రక్షించుటయు; చేయఁగన్ = చేయుటకు; నృపులన్ = రాజుని {నృపుడు - నృ (నరులను) పాలించువాడు, రాజు}; స్రష్ట = బ్రహ్మదేవుడు {స్రష్ట - సమస్తమును సృజించువాడు, బ్రహ్మదేవుడు}; విధించెన్ = నియమించెనని; పురాణ = పురాణములను; ద్రష్టలున్ = దర్శించినవారు; సెప్పుదురు = చెప్పుదురు; పరమ = అతిముఖ్యమైన; ధర్మము = ధర్మము, విధి; సాధ్వీ = సాధు శీలము కలదానా.

భావము:

సాధ్వీమణివైన పృథ్వీ! దుష్టులను శిక్షించటం కోసం శిష్టులను రక్షించటం కోసమే భగవంతుడైన బ్రహ్మదేవుడు రాజులను సృష్టించాడని శాస్త్రవేత్తలు చెబుతారు. కనుక ఇప్పుడు రాజునైన నాకు ఆర్తరక్షణం అన్నది పరమధర్మం.”