పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కలి నిగ్రహంబు

  •  
  •  
  •  

1-423-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

""ణితవైభవుం డగు మురాంతకుఁ డక్కట పోయె నంచు నె
వ్వలఁ గృశించి నేత్రముల వారికణంబులు దేకు మమ్మ! లో
బెడకు మమ్మ! మద్విశిఖబృందములన్ వృషలున్ వధింతు నా
గఁటిమిఁ జూడ వమ్మ! వెఱ మానఁ గదమ్మ! శుభప్రదాయినీ!

టీకా:

అగణిత = ఎంచుటకు వీలుకాని; లెక్కింపవీలుకాని; వైభవుండు = వైభవము కలవాడు; అగు = అయినట్టి; మురాంతకుడు = కృష్ణుడు {మురాంతకుడు - ముర అను రాక్షసుని సంహరించిన వాడు, కృష్ణుడు}; అక్కట = అయ్యో; పోయెన్ = చనెను; అంచున్ = అనుచును; ఏ = ఏ విధమైన; వగలన్ = శోకముతోను; కృశించి = కృశించిపోయి, చిక్కిపోయి; నేత్రముల = కన్నులలో; వారి = నీటి; కణంబులున్ = బిందువులను; తేకుము = తీసుకు రాకుము; అమ్మ = తల్లీ; లోన్ = లోలోపల; బెగడకుము = భయపడకు; బెంగపడకు; అమ్మ = తల్లీ; మత్ = నా యొక్క; విశిఖ = బాణముల; బృందములన్ = సమూహములచేత; వృషలున్ = పాపాత్ముని; వధింతున్ = సంహరించుదును; నా = నా యొక్క; మగఁటిమిన్ = మగతనమును, శౌర్యమును; చూడవమ్మ = చూడుము తల్లీ; వెఱ = భయపడుట; మానన్ = మానవలసినది; కద = కదా; అమ్మ = తల్లీ; శుభ = శుభములను; ప్రదాయినీ = ఇచ్చేదానా.

భావము:

“అమ్మా! అనంత వైభవోపేతుడైన శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని వదలి వెళ్లిపోయాడనే ఆవేదనతో కృశించి కన్నీరు మున్నీరుగా ఏడువకు. మనస్సులో దిగులు పెట్టుకోబోకు, కల్యాణదాయిని వైన నిన్ను తన్నిన ఈ దుర్మార్గుణ్ణి ఇప్పుడే నా బాణాలతో నేల కూలుస్తాను, నా పౌరుషమును, చూడు తల్లీ! భయకంపితవు కాబోకు మమ్మా!