పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కలి నిగ్రహంబు

  •  
  •  
  •  

1-417-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గాండీవియుఁ జక్రియు భూ
మంలిఁ బెడఁబాసి చనిన దమత్తుఁడవై
దండింపఁ దగనివారల
దండించెదు నీవ తగుదు దండనమునకున్.""

టీకా:

గాండీవియున్ = అర్జునుడును {గాండీవి - గాండీవము అను విల్లు కలవాడు, అర్జునుడు}; చక్రియు = కృష్ణుడును; భూమండలిన్ = భూలోకమును; పెడఁబాసి = వదిలివేసి; చనినన్ = చనగా, వెళ్ళిపోగా; మద = మదముతో; మత్తుఁడవు = మత్తెక్కినవాడవు; ఐ = అయి; దండింపన్ = , శిక్షించుటకు; తగని = యుక్తము కాని; వారలన్ = వారిని; దండించెదు = దండించెదవు, శిక్షించెదవు; నీవ = నీవె; తగుదు = తగినవాడవు; దండనమున = , శిక్షింపబడుట; కున్ = కు.

భావము:

గాండీవధారి అయిన అర్జునుడూ, చక్రధారి అయిన శ్రీకృష్ణుడూ ఈ భూమండలాన్ని విడిచి వెళ్లారనే ధీమాతో మదోన్మత్తుడవై దండింపతగని సాధువులను దండిస్తున్న నీకు ప్రచండమైన రాజదండన తప్పదు.”