పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కలి నిగ్రహంబు

  •  
  •  
  •  

1-415-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లాధేను వృషభంబుల రెంటిం గంటకుండై తన్నుచున్న రాజలక్షణ ముద్రితుండయిన శూద్రునిం జూచి, సువర్ణ పరికరస్యందనారూఢుం డగు నభిమన్యునందనుండు గోదండంబు సగుణంబు సేసి, మేఘగంభీరరవంబు లగు వచనంబుల నిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; ఆ = ఆ; ధేను = ఆవు; వృషభంబులన్ = ఎద్దులను; రెంటిన్ = రెండింటిని; కంటకుడు = ముల్లు వంటివాడు; బాధపెడుతున్న వాడు; ఐ = అయి; తన్నుచున్న = తన్నుచున్న; రాజ = రాజు యొక్క; లక్షణ = లక్షణములు; ముద్రితుండు = గుర్తులు కలవాడు; అయిన = అయినట్టి; శూద్రునిన్ = శూద్రుని; చూచి = చూసి; సువర్ణ = బంగారు; పరికర = ఉపకరణములు కల, మంచ కల; స్యందన = రథమును; ఆరూఢుండు =; ఎక్కినవాడు; అగున్ = అయినట్టి; అభిమన్యునందనుండు = పరీక్షిత్తు; కోదండంబు = విల్లు; సగుణంబు = అల్లెత్రాడు కట్టబడినదిగా {గుణము - అల్లెత్రాడు, లక్షణము}; చేసి = చేసి; మేఘ = మేఘముల యొక్క; గంభీర = గంభీరమైన; రవంబులు = ధ్వనులు కలవి; అగు = అయిన; వచనంబులన్ = మాటలతో; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

“ఓ వృషభ రూపంలో ఉన్న ధర్మదేవా! మా కురువంశ నరేంద్రుల బాహుదండాలనే కోటగోడల మధ్య సురక్షితంగా ఉండే రాజ్యం లోని ప్రజలు, అధర్మంగా ఏ జీవులను బాధించరు, కన్నీరు కార్పించరు. దీనికి విరుద్దంగా నీ కనుల వెంట అన్యాయంగా బాష్పధారలు కార్పించిన దురాత్ముణ్ణి, నా అవక్రపరాక్రమంతో ఇప్పుడే నరుకుతాను. ఇదిగో చూడు!