పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : గోవృషభ సంవాదం

  •  
  •  
  •  

1-414-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లోలాంగక నశ్రు తోయ కణ జాలాక్షిన్, మహాంభారవన్,
బాలారూఢ తృణావళీకబళలోవ్యాప్త జిహ్వాగ్ర, నాం
దోస్వాంతనజీవవత్స నుదయద్దుఃఖాన్వితన్, ఘర్మకీ
లాలాపూర్ణశరీర, నా మొదవు నుల్లంఘించి తన్నెన్ వడిన్.

టీకా:

ఆలోల = వణుకుతున్న; అంగకన్ = అవయవములు కలది; అశ్రు = కన్నీటి; తోయ = నీటి; కణ = బిందువులు; జాల = జాలువారుతున్న, చిమ్ముతున్న; అక్షిన్ = కన్నులు కలది; మహా = పెద్దగా; అంభా = అంభా అనుచు; రవన్ = అరచినది; బాల = కొత్తగ; ఆరూఢ = మొలకెత్తిన; తృణ = గడ్డి; వళీ = సముదాయపు; కబళ = కడిపై, ముద్దపై; లోభ = ఆపేక్ష వలన; వ్యాప్త = చాచిన; జిహ్వ = నాలుక; అగ్రన్ = చివర కలది; ఆందోళ = చలించిన, దుఃఖపడిన; స్వాంతన్ = మనసు కలదానిని; అజీవ = చనిపోయిన; వత్సన్ = దూడ కలదానిని; ఉదయ = పెల్లుబుకుచున్న; దుఃఖ = దుఃఖము; అన్వితన్ = కూడి ఉన్నదానిని; ఘర్మ = చెమట; కీలాలా = నీటితో; పూర్ణ = నిండిన; శరీరన్ = శరీరము కలది; ఆ = ఆ; మొదవున్ = పాడియావును; ఉల్లంఘించి = ఎగిరి దూకి; తన్నెన్ = తన్నెను; వడిన్ = బలంగా.

భావము:

గడగడ వణుకుతూ కన్నుల వెంబడి అశ్రుధారలు కారుస్తున్న దాన్ని, గొంతెత్తి అంబా అని అరుస్తున్నదాన్ని, జంపుగా పెరిగిన లేత పచ్చిక మేయటానికి నాలుక చాస్తున్న దాన్ని, చెదరిన గుండెకలదాన్ని, లేగదూడ లేకుండా ఒంటరిగా వచ్చిన దాన్ని, ఉబికి వస్తున్న దుఃఖము కలదానిని, సేదజలంతో నిండిన దేహం కలదానిని, ఆ గోమాతను, ఆ పాపాత్ముడు ఎగిరి తన్నాడు.