పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : గోవృషభ సంవాదం

  •  
  •  
  •  

1-410-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మెల్లన నాపై యాదవ
ల్లభుఁ డడుగిడఁగ మోహశనై నేరం
జిల్లగ రోమాంచము క్రియ
మొల్లములై మొలచు సస్యములు మార్గములన్.""

టీకా:

మెల్లన = మెల్లగా; నా = నా; పై = పైన; యాదవవల్లభుఁడు = కృష్ణుడు {యాదవవల్లభుఁడు - యాదవులకు ప్రియమైనవాడు, కృష్ణుడు}; అడుగు = అడుగు; ఇడఁగన్ = పెట్టగా; మోహ = మోహమునకు; వశను = లొంగినదానను; ఐ = అయి; నేన్ = నేను; రంజిల్లగ = అనురాగ ముప్పతిల్లగా; రోమాంచము = గగుర్పాటు; క్రియన్ = వలె; మొల్లములు = అధికములు; ఐ = అయి; మొలచు = అంకురించు; సస్యములు = ధాన్యపుగింజలు; మార్గములన్ = దారులమ్మట.

భావము:

ఆ గోపికా వల్లభుండు నా పైన మెల్ల మెల్లగా అడుగుల పెడుతూ నడుస్తుంచే ఆనంద పారవశ్యంలో నా ఒళ్లు గగుర్పొడిచేది. నా దేహం నిండా మొలిచిన ఆ పులకాంకురాలే దట్టమైన సస్యాంకురాలై అడుగడుగునా పొడచూపేవి.""