పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : గోవృషభ సంవాదం

  •  
  •  
  •  

1-409-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ధురోక్తు లా నయము లా దరహాసము లా దయారసం
బా మురిపంబు లా తగవు లా గమనక్రియ లా మనోహర
ప్రేకరావలోకనము ప్రీతిఁ గనుంగొనలేమి మాధవుం
గామినులేల? నిర్దళితర్ములు యోగులుఁ బాయనేర్తురే?

టీకా:

ఆ = ఆ; మధుర = తీయని; ఉక్తులున్ = మాటలు; ఆ = ఆ; నయములున్ = లాలనలు; ఆ = ఆ; దరహాసములున్ = చిరునవ్వులు; ఆ = ఆ; దయ = దయతో కూడిన; రసంబున్ = రసము, రసభావము; ఆ = ఆ; మురిపంబులున్ = మురిపించుటలు, కులుకులు; ఆ = ఆ; తగవులున్ = చిలిపి తగవులు; ఆ = ఆ; గమన = నడచే; క్రియలున్ = విధానములు; ఆ = ఆ; మనస్ = మనసును; హర = చూరగొను; ప్రేమ = ప్రేమ; కర = పుట్టించునట్టి; అవలోకనము = చూపు; ప్రీతిన్ = ఇష్టముతో; కనుంగొన = చూచుకొనుటలు; లేమిన్ = లేకపొవుటను; మాధవున్ = కృష్ణుని; కామినులు = స్త్రీలు {కామిని - ప్రియ సంగము నందు మిక్కిలి ఆశ కలామె, స్త్రీ.}; ఏల = ఏమి; నిర్దళిత = తెంచుకొన్న; కర్ములు = కర్మములు కలవారు; యోగులున్ = యోగలైన; పాయన్ = సహించుటను; నేర్తురే = ఓపకలరా.

భావము:

మాధవుని లీలలు మరిచిపోలేము. ఆ తీయ తీయని మాటలు, ఆ నయగారాలు, ఆ చిరునవ్వులు, ఆ కనికరాలు, ఆ ముద్దు మురిపాలు, ఆ ప్రణయకలహాలు, ఆ సుందరమందయానాలు, మనస్సులను హరించే ఆ మధుర కటాక్షవీక్షణాలు దూరమై పోతాయే అనే విచారంతో అంగనలే కాదు సర్వసంగ పరిత్యాగులైన యోగులు కూడా ఆ దయామయుని వియోగాన్ని సహించలేరు.