పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : గోవృషభ సంవాదం

  •  
  •  
  •  

1-406.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి వాసుదేవు బ్జ, వజ్రాంకుశ,
క్ర, మీన, శంఖ, చాప, కేతు
చిహ్నితంబులైన శ్రీచరణము లింక
సోఁక వనుచు వగపు సోఁకెనయ్య!

టీకా:

బ్రహ్మ = బ్రహ్మ; ఆదులు = మొదలగువారు; ఎవ్వని = ఎవనియొక్క; భద్ర = క్షేమకరమైన; కటాక్ష = దయతోకూడిన, కడ+అక్ష,కడకంటి; వీక్షణమున్ = చూపు; వాంఛింతురు = కోరుదురు; సత్ = మంచి; తపములన్ = తపస్సులతో; కమలాలయము = సరస్సునందు {కమలాలయము - కమలములకు స్థానము, సరస్సు}; మాని = ఉండుటమాని, వదలి; కమల = లక్ష్మి; ఎవ్వని = ఎవనియొక్క; పాద = పాదములు అను; కమలంబున్ = కమలమును; సేవించున్ = పూజించును; కౌతుకమునన్ = కుతూహలముతో; పరమ = గొప్ప; యోగ = యోగులలో; ఇంద్రులు = ఇంద్రులు; భవ్య = శుభమైన; చిత్తములు = మనస్సు; అందున్ = అందు; నిలుపుదురు = స్థిర పరచుకొందురు; ఎవ్వని = ఎవని; నియతి = నియములు; తోడన్ = తో; వేదంబులు = వేదములు; ఎవ్వని = ఎవని; విమల = నిర్మలమైన; చారిత్రముల్ = వృత్తాంతములు; వినుతింపఁగాన్ = కీర్తించ; లేక = లేక; వెగడు = తల్లడిల్లు, తడబాటు; పడియెన్ = పడినవి;
అట్టి = అటువంటి; వాసుదేవు = కృష్ణుని; అబ్జ = పద్మము వంటి; వజ్ర = వజ్రము వంటి; అంకుశ = అంకుశము వంటి; చక్ర = చక్రము వంటి; మీన = చేప వంటి; శంఖ = శంఖము వంటి; చాప = విల్లు వంటి; కేతు = జండా వంటి; చిహ్నితంబులు = గుర్తులు ఉన్నట్టివి; ఐన = అయినట్టి; శ్రీ = పవిత్రమైన; చరణములు = పాదములు; ఇంకన్ = ఇక మీదట; సోఁకవు = తగలవు; అనుచున్ = అనుకొనుచు; వగపు = విచారము; సోఁకెన్ = పుట్టెను; అయ్య = నాయనా.

భావము:

బ్రహ్మాది దేవతలంతా ఎంతో కాలం తపస్సులు చేసి చేసి ఏ దేవుని కల్యాణ కరుణా కటాక్షవీక్షణాలను కాంక్షిస్తారో, పద్మాలయ అయిన లక్ష్మీదేవి తన నివాసమైన పద్మాన్ని సైతం విడిచి, అత్యంత కుతూహలంతో ఏ దేవుని పాదపద్మాలను ఆరాధిస్తున్నదో, పరమ నిష్ఠాగరిష్ఠులైన మునిశ్రేష్ఠులు తమ పవిత్ర హృదయ ఫలకాలపై ఏ దేవుని పావన స్వరూపాన్ని నియమపూర్వకంగా నిలుపు కొంటున్నారో, సమస్త వేదాలూ ఏ దేవుని దివ్య చరిత్రలు సరిగా వర్ణించలేక తడబాటు పడుతున్నాయో, అటువంటి దేవాదిదేవుడైన వాసుదేవుని పద్మ, వజ్ర, అంకుశ, శంఖ, చక్ర, చాప, మీన, ధ్వజ రేఖలతో అలంకృతాలైన శ్రీచరణాలు ఇక మీద, నా మీద సోకవు గదా అని శోకిస్తున్నాను. తండ్రీ!