పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : గోవృషభ సంవాదం

  •  
  •  
  •  

1-398.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హీనవంశ జాతు లేలెదరనియొ? రా
జ్యములు పాడిగలిగి రుగవనియొ?
నుజు లన్న, పాన, మైథున, శయ, నాస
నాది కర్మసక్తు గుదు రనియొ?

టీకా:

మఖములు = యజ్ఞములు; లేమిన్ = లేకపోవుట వలన; అమర్త్యుల = దేవతల; కిన్ = కి; ఇట = ఇక; మీఁదన్ = పైన; మఖభాగములు = హవిర్భాగములు; లేక = లేక; మానున్ = పోవుననియు; అనియొ = అనియేమో; రమణులు = భర్తలు; రమణులన్ = భార్యలను; రక్షింపరు = కాపాడరు; అనియొ = అనియేమో; పుత్రులన్ = కొడుకులను; తల్లిదండ్రులు = తల్లిదండ్రులు; ప్రోవరు = పోషింపరు; అనియొ = అనియేమో; భారతి = సరస్వతి; కుజనులన్ = చెడ్డవారిని; ప్రాపించున్ = పొందును; అనియొ = అనియేమో; సత్ = మంచి; విప్రులు = బ్రాహ్మణులు; నృపులన్ = రాజులని {నృపులు - నరులను పాలించువారు, రాజులు}; సేవింతురు = కొలచెదరు; అనియొ = అనియేమో; కులిశహస్తుఁడు = ఇంద్రుడు {కులిశము హస్తమున కలవాడు - ఇంద్రుడు}; వానన్ = వర్షమును; కురియింపక = కురియింపక; ఉండఁగన్ = ఉండటవలన – పోవుటవలన; ప్రజలు = జనులు; దుఃఖంబులన్ = బాధలను; పడుదురు = పొందుదురు; అనియొ = అనియేమో;
హీన = తక్కువ; వంశ = వంశమందు; జాతులు = పుట్టినవారు; ఏలెదరు = పాలించెదరు; అనియొ = అనియేమో; రాజ్యములు = రాజ్యములు; పాడి = నీతి నియములు; కలిగి = కలిగి, సరిగ; జరుగవు = నడువవు; అనియొ = అనియేమో; మనుజులు = మానవులు; అన్న = భుజించుట; పాన = పానము చేయుట; మైథున = మైథునము; శయన = శయనించుట; ఆసన = ఆసీనులగుట; ఆది = మొదలగు; కర్మ = కర్మలందు; సక్తులు = ఆసక్తి కలవారు; అగుదురు = అవుతారు; అనియొ = అనియేమో.

భావము:

యజ్ఞాలు లేనందువల్ల ఇకముందు దేవతలకు హవిర్భాగాలు లభించవనీ; భర్తలు భార్యలను రక్షింపరనీ; పిల్లలు తల్లిదండ్రులను పోషించరనీ బాధపడుతున్నావా? సరస్వతి దుర్జనులను ఆశ్రయిస్తుందనీ; ఉత్తమ విప్రులు రాజులకు సేవ చేస్తారనీ; ఇంద్రుడు వర్షం కురిపించక ప్రజలు కష్టాల పాలవుతారనీ ఖేదపడుతున్నావా? హీన వంశ సంజాతులు రాజ్యాలు ఏలుతారనీ; దేశంలో న్యాయం నశించి పోతుందనీ; మానవులు ఆహార నిద్రా మైథునాది కర్మలయందు ఆసక్తు లౌతారనీ విచారిస్తున్నావా? ఎందుకు నీ కీ ఆవేదన?