పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : గోవృషభ సంవాదం

  •  
  •  
  •  

1-397-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

""నాంభఃకణజాల మేల విడువన్ నా తల్లి నీ మేను సా
మై యున్నది; మోము వాడినది; నీ న్నించు చుట్టాలకున్
దుఃఖంబులు నెందు వొందవు గదా? బంధించి శూద్రుల్ పద
త్రహీనన్ ననుఁ బట్టవత్తురనియో, తాపంబు నీ కేటికిన్.

టీకా:

నయన = కన్నులనుండి; అంభః = నీటి; కణ = కణముల; జాలము = సమూహము; ఏల = ఎందులకు; విడువన్ = విడువగా; నాతల్లి = నాతల్లి; నీ = నీయొక్క; మేను = శరీరము; స = కూడిన; ఆమయము = రోగములుకలది; ఐ = అయి; ఉన్నది = ఉన్నది; మోము = ముఖము; వాడినది = వాడిపోయినది; నీ = నిన్ను; మన్నించు = గౌరవించు; చుట్టాల = బంధువుల; కున్ = కును; భయ = భయములును; దుఃఖంబులున్ = దుఃఖములును; ఎందు = ఎక్కడను; ఒందవున్ = పొందకుండును; కదా = కదా; బంధించి = బంధించి; శూద్రుల్ = శూద్రులు; పద = పాదములు; త్రయ = మూడు; హీనన్ = నష్టపోయిన; ననున్ = నన్ను; పట్టన్ = పట్టుటకు; వత్తురు = వచ్చెదరు; అనియో = అనియా ఏమి; తాపంబు = వేదన; నీకు = నీకు; ఏటి = ఎందుల; కిన్ = కు.

భావము:

""తల్లీ! నీ కన్నుల నుంచి బాష్పధారలు ప్రవహిస్తున్నాయి యేమిటి? నీ దేహం వ్యాధిగ్రస్తమై ఉన్నదేమిటి? నీ వదనమంతా అలా వాడిపోయిందే మిటి? నీ ప్రియ బంధువులకు భయదుఃఖాలు ప్రాప్తించలేదు కదా? శూద్రులు ఒంటికాలితో కుంటుతూ ఉన్న నన్ను పట్టి బంధిస్తారేమోనని దిగులు పడుతున్నావా? పిచ్చి తల్లీ! ఎందుకిలా ఉన్నావు?