పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పరీక్షిత్తు దిగ్విజయయాత్ర

  •  
  •  
  •  

1-393-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విందాక్ష పదారవింద మకరందాసక్తులై యున్న స
త్పురుషశ్రేష్ఠుల వృత్తముల్ వినక దుర్బుద్దిన్ విలంఘించి, దు
ర్నవార్తాకథనప్రపంచములు గర్ణప్రాప్తముల్ సేసి, వా
ముల్ వ్యర్థతఁ దోచుచుండఁ జన దీ సంసారమోహంబునన్.

టీకా:

అరవిందాక్ష = కృష్ణుని {అరవిందాక్షః - అరవిందములవంటి కన్నులున్నవాడు, విష్ణువు, కృష్ణుడు, విష్ణుసహస్రనామాలు 347వ నామం}; పద = పాదములు అను; అరవింద = పద్మముల; మకరంద = తేనె యందు; ఆసక్తులు = ఆసక్తి కలవారు; ఐ = అయి; ఉన్న = ఉన్నట్టి; సత్ = మంచి; పురుష = పురుషులలో; శ్రేష్ఠుల = శ్రేష్ఠమైనవారి యొక్క; వృత్తముల్ = వృత్తాంతములు; వినక = వినక; దుర్బుద్ధిన్ = దుర్బుద్ధితో; విలంఘించి = దూకి; దుర్నర = చెడ్డ మానవుల; వార్తా = వృత్తాంతములు కల; కథన = కథల; ప్రపంచములున్ = మొత్తములను; కర్ణ = చెవులలో; ప్రాప్తముల్ = పడునట్లు; చేసి = చేసి; వాసరముల్ = రోజులు; వ్యర్థతన్ = వ్యర్థముగా; తోచుచు = గడుపుతూ; ఉండన్ = ఉండుట; చనదు = చేయరాదు, తగదు; ఈ = ఈ; సంసార = సంసార మందలి; మోహంబునన్ = మోహముతో.

భావము:

నందనందన పాదారవింద మకరంద పానంచేత పరవశులైన ఉత్తమ పురుషుల పవిత్ర చరిత్రలు వినకుండా పెచ్చు పెరిగిన మచ్చరంతో దుశ్చరిత్రులకు చెవులొగ్గి. సంసారబంధాలకు లోబడి, పరమార్థాన్ని విస్మరించి, వ్యర్థంగా కాలం గడపరాదు.