పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పరీక్షిత్తు దిగ్విజయయాత్ర

  •  
  •  
  •  

1-392-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

""భూరరూపుఁడు శూద్రుఁడు
గోవుం దా నేల తన్నెఁ, గోరి పరీక్షి
ద్భూరుఁడు దిశల గెలుచుచు
నే విధిఁ గలి నిగ్రహించె, నెఱిఁగింపఁ గదే.

టీకా:

భూవర = రాజు యొక్క {భూవరుడు - భూమికిభర్త, రాజు}; రూపుఁడు = వేషము ధరించిన వాడు; శూద్రుఁడు = శూద్రుడు; గోవున్ = గోవులను; తాన్ = తాను; ఏల = ఎందులకు; తన్నెన్ = తన్నెను; కోరి = కావాలని; పరీక్షిత్ = పరీక్షితుడు అను; భూవరుఁడు = రాజు; దిశలన్ = నలు దిశలందలి రాజ్యములను; గెలుచుచున్ = గెలుచుచు; ఏ = ఏ; విధిన్ = విధముగ; కలిన్ = కలిని; నిగ్రహించెన్ = శిక్షించెను; కట్టుదిట్టము చేసెను; ఎఱిఁగింపఁగదే = తెలుపుము.

భావము:

""అయ్యా! సూతమహర్షీ! రాజవేషంలో ఉన్న శూద్రుడు గోవును ఎందుకు తన్నాడు. జైత్రయాత్ర సాగిస్తున్న పరీక్షిన్నరేంద్రుడు ఆ కలిని ఏ విధంగా నిగ్రహించాడు నాకు వివరంగా చెప్పు.