పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పాండవుల మహాప్రస్థానంబు

  •  
  •  
  •  

1-390-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పాంవకృష్ణుల యానము,
పాండురమతి నెవ్వఁడైనఁ లికిన విన్నన్
ఖండితభవుఁడై హరిదా
సుండై కైవల్యపదము సొచ్చు నరేంద్రా!

టీకా:

పాండవ = పాండవులయొక్క; కృష్ణుల = కృష్ణుని యొక్క; యానము = ప్రయాణము; పాండుర = స్వచ్ఛమైన; మతిన్ = బుద్ధితో; ఎవ్వఁడు = ఎవడు; ఐనన్ = అయినప్పటికిని; పలికినన్ = చెప్పినను, స్మరించినను; విన్నన్ = విన్నను; ఖండితభవుఁడు = జన్మరాహిత్యుడు {ఖండితభవుడు - ఖండింపబడిన జన్మలు కలవాడు, జన్మరాహిత్యము పొందినవాడు}; ఐ = అయి; హరి = భగవంతునికి; దాసుండు = దాసుడు; ఐ = అయి; కైవల్యపదమున్ = మోక్షమును; పరమ పదమును; చొచ్చున్ = చేరును; నరేంద్రా = రాజా {నరేంద్రుడు - నరులకు ఇంద్రుడు, రాజు.}; రాజు}.

భావము:

రాజా! పాండవుల మహాప్రస్థానమూ, శ్రీకృష్ణుని పరమపద యానమూ, స్వచ్ఛమైన హృదయంతో చదివినవాడూ, విన్నవాడూ, భవబంధ విముక్తుడై, పరమేశ్వర భక్తుడై కైవల్య పథాన్ని కైవసం చేసుకొంటాడు.