పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పాండవుల మహాప్రస్థానంబు

  •  
  •  
  •  

1-388-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత నాతని తమ్ము నిలపుత్త్రాదులు-
లిరాకచేఁ బాపర్ము లగుచుఁ
రియించు ప్రజల సంచారంబు లీక్షించి-
ఖిల ధర్మంబుల నాచరించి
వైకుంఠ చరణాబ్జ ర్తిత హృదయులై-
ద్భక్తినిర్మలత్వమునుఁ జెంది
విషయయుక్తులకుఁ బ్రవేశింపఁగా రాక-
నిర్ధూతకల్మష నిపుణమతులు

1-388.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హుళవిజ్ఞానదావాగ్ని సితకర్ము
లైన యేకాంతులకు లక్ష్యమై వెలుంగు
ముఖ్యనారాయణస్థానమునకుఁ జనిరి
విగతరజమైన యాత్మల విప్రముఖ్య!

టీకా:

అంతన్ = అంతట; ఆతని = అతనియొక్క; తమ్ములు = తమ్ముళ్ళు; అనిలపుత్ర = భీముడు {అనిలపుత్రుడు - వాయుదేవుని కొడుకు, భీముడు}; ఆదులు = మొదలగువారు; కలి = కలికాలము; రాక = వచ్చుట; చేన్ = చేత; పాప = పాపపు; కర్ములు = కర్మలుచేయువారు; అగుచున్ = అవుతూ; చరియించున్ = చరించు; ప్రజల = ప్రజలయొక్క; సంచారంబుల్ = ప్రవర్తనలు; ఈక్షించి = చూసి; అఖిల = సమస్తమైన; ధర్మంబులన్ = ధర్మబద్ధముగ చేయవలసిన కార్యములు; ఆచరించి = చేసి; వైకుంఠ = హరి {వైకుంఠుడు - వైకుంఠమున ఉండువాడు, విష్ణువు}; చరణ = పాదములు అను; అబ్జ = పద్మములవెంట {అబ్జము - నీటపుట్టునది, పద్మం}; వర్తిత = ప్రవర్తిల్లు; హృదయులు = హృదయము కలవారు; ఐ = అయ్యి; తత్ = ఆ; భక్తి = భక్తి యొక్క; నిర్మలత్వమునున్ = నిర్మలత్వమును; చెంది = చెంది; విషయ = ఇంద్రియార్థములందు; యుక్తుల = తగుల్కొని ఉండువారి; కున్ = కి; ప్రవేశింపఁగాన్ = ప్రవేసించుటకు; రాక = వీలుకాని; నిర్ధూత = క్షాళనముచేసికొన్న; కల్మష = కల్మషముకల; నిపుణ = నేర్పరి ఐన; మతులు = మనస్సులు కలవారు;
బహుళ = ఎక్కువ; విజ్ఞాన = విజ్ఞానము అను; దావాగ్నిన్ = కారుచిచ్చుచేత; భసిత = భస్మమైన; కర్ములు = కర్మ కలవారు; ఐన = అయినట్టి; ఏకాంతులు = ఏకాంతులు {ఏకాంతులు - ఉన్నది భగవంతుడు ఒక్కడే అన్న స్థితి లో ఉన్నవారు}; కున్ = కు; లక్ష్యము = గమ్యస్థానమైనది – కామిడి యైనది; ఐ = అయ్యి; వెలుంగు = ప్రకాశించు; ముఖ్య = ముఖ్యమైన; నారాయణ = విష్ణు {నారాయణుడు - నారములందువసించువాడు – హరి}; స్థానము = లోకము, సన్నిధి; కున్ = కి; చనిరి = వెళ్ళిరి; విగత = విడిచిపెట్టిన; రజము = రజోగుణము; ఐన = కలిగిన; ఆత్మల = ఆత్మలతో; విప్ర = బ్రాహ్మణులలో; ముఖ్య = ముఖ్యమైనవాడా.

భావము:

అనంతరం ధర్మజుని సోదరులైన భీమసేనాదులు కలిప్రభావంతో ప్రజలంతా పాపమార్గంలో సంచరించటం గమనించారు. దానధర్మాలు ఆచరించారు. శ్రీమన్నారాయణుని పాదపద్మాలను తమ హృదయంలో పదిలపరచుకొన్నారు. భగవద్భక్తిచే పరిశుద్ధ జీవనులైనారు. ఈ విధంగా వారు రజోగుణ రహితమైన హృదయాలతో విషయాసక్తులకు ప్రవేశింపరానిదీ, పాపరహితులూ, విజ్ఞాన సంపన్నులూ అయిన ఏకాంతభక్తులకు గమ్యస్థానమై వెలుగొందేదీ అయిన విష్ణు లోకాన్ని చేరుకున్నారు.