పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పాండవుల మహాప్రస్థానంబు

 •  
 •  
 •  

1-381-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియు దేశకాలార్థయుక్తంబులు, నంతఃకరణ సంతాప శమనంబులునయిన హరివచనంబులం దలంచి, చిత్తంబు పరాయత్తంబయియున్నది;" అని యన్నకుం జెప్పి నిరుత్తరుండై, నిరంతర హరిచరణారవిందచింతామలబుధియై, శోకంబు వర్జించి, సదా ధ్యాన భక్తివిశేషంబులం గామక్రోధాదుల జయించి, తొల్లి తన కుభయసేనా మధ్యంబున నచ్యుతుం డానతిచ్చిన గీతలు దలంచి, కాలకర్మ భోగాభినివేశంబులచేత నావృతంబయిన విజ్ఞానంబుఁ గ్రమ్మఱ నధిగమించి,హేతుమద్భావంబున శోకహేతు వహంకార మమకారాత్మకంబయిన ద్వైతభ్రమం బనియును, ద్వైతభ్రమంబునకుఁ గారణంబుదేహం బనియును, దేహంబునకు బీజంబు లింగంబనియును,లింగంబునకు మూలంబు గుణంబు లనియును, గుణంబులకు నిదానంబు ప్రకృతియనియును, ”బ్రహ్మాహ" మనియెడు జ్ఞానంబున లీనయై ప్రకృతి లేకుండుననియు, ప్రకృతి యడంగుటయ నైర్గుణ్యంబనియును నైర్గుణ్యంబువలనఁ గార్యలింగ నాశం బనియును, గార్యలింగనాశంబున నసంభవంబగు ప్రకృతింబాసి, క్రమ్మఱ స్థూలశరీర ప్రాప్తుండుగాక పురుషుండు సమ్యగ్భోగంబున నుండు ననియును నిశ్చయించి యర్జునుండు విరక్తుండై యూరకుండె; ధర్మజుండు భగవదీయమార్గంబు దెలిసి యాదవుల నాశంబు విని నారదువచనంబులం దలంచి నిశ్చలచిత్తుండై స్వర్గమార్గ గమనంబునకు యత్నంబు సేయు చుండె నా సమయంబున.

టీకా:

మఱియున్ = ఇంకనూ; దేశ = ప్రదేశముతో; కాల = కాలముతో; అర్థ = అర్థముతోను; యుక్తంబులున్ = కూడినవి; అంతఃకరణ = అంతఃకరణమునందలి, మనసులోపలి; సంతాప = మిక్కిలి తాపములను; శమనంబులు = శమింపజేయునవి; అయిన = అయినట్టి; హరి = హరియొక్క; వచనంబులన్ = వచనములు; తలంచి = స్మరించి; చిత్తంబు = మనసు; పరాయత్తంబు = వికలము {పరాయత్తము - ఆయత్తమునకు పరమైనది, వికలము}; అయి = అయి; ఉన్నది = ఉన్నది; అని = అని; అన్న = అన్న; కున్ = కి; చెప్పి = చెప్పి; నిరుత్తరుండు = మౌని {నిరుత్తరుండు - జవాబు లేనివాడు, మౌని}; ఐ = అయి; నిరంతర = ఎడతెగ కుండగ; హరి = భగవంతుని; చరణ = పాదములు అను; అరవింద = పద్మములందు; చింత = ధ్యానించుట వలన; అమల = మలములు లేని, నిర్మలమైన; బుద్ధి = బుద్ధికలవాడు; ఐ = అయి; శోకంబు = దుఃఖమును; వర్జించి = విడిచిపెట్టి; సదా = ఎల్లప్పుడు; ధ్యాన = ధ్యానించుట యొక్క; భక్తి = భక్తి కలిగి ఉండుట యొక్క; విశేషంబులన్ = ప్రత్యేకతల వలన; కామ = కామము; క్రోధ = క్రోధము; ఆదులన్ = మొదలగువానిని; జయించి = జయించి; తొల్లి = ఇంతకు పూర్వము; తన = తన; కున్ = కి; ఉభయ = రెండు; సేనా = సేనల; మధ్యంబునన్ = మధ్యస్థలములో; అచ్యుతుండు = కృష్ణుడు; ఆనతి = ఉపదేశముగ; ఇచ్చిన = ఇచ్చినట్టి; గీతలు = భగవద్గీతా వాక్యములు; తలంచి = తలచుకొని; కాల = కాలమును; కర్మ = ప్రారబ్దములును; భోగ = భోగములును; ఆభినివేశంబులు = అభిలాష కలిగి ఉండుట, సక్తులు; చేతన్ = చేతను; ఆవృతంబు = కప్పబడినది; అయిన = అయినట్టి; విజ్ఞానంబున్ = విజ్ఞానమును; క్రమ్మఱన్ = మరల; అధిగమించి = దాటి; హేతు = హేతువును, తార్కిక; మత్ = తెలుసుకొనిన, శాస్త్ర; భావంబున = లక్షణముచేత; భావము వలన; శోక = శోకమునకు; హేతువు = కారణము; అహంకార = నేను; మమకార = నాది; ఆత్మకంబు = అను భావములు కలది; అయిన = అయినట్టి; ద్వైతభ్రమంబు = ద్వైతభ్రమ {ద్వైతభ్రమ - రెండు ఉన్నట్లు అనిపించు భ్రాంతి; జీవాత్మ పరమాత్మ అనునవి రెండు అను భ్రమ}; అనియును = అనియును; ద్వైతభ్రమంబున = ద్వైతభ్రమమున; కున్ = కు; కారణంబు = కారణము; దేహంబు = దేహము; అనియును = అనియును; దేహంబున = దేహమున; కున్ = కు; బీజంబు = మూలము; లింగంబు = లింగశరీరము {లింగశరీరము – సూక్ష్మశరీరము, మనస్సు}; అనియును = అనియును; లింగంబున = లింగశరీరమున; కున్ = కు; మూలంబు = మూలము; గుణంబులు = గుణములు; అనియును = అనియును; గుణంబుల = గుణముల; కున్ = కి; నిదానంబు = మొదలి కారణము; ప్రకృతి = ప్రకృతి; అనియును = అనియును; బ్రహ్మాహం = బ్రహ్మనునేనే; అనియెడు = అనే; జ్ఞానంబున = జ్ఞానము వలన; లీనము = లయించి పోయినది; ఐ = అయి; ప్రకృతి = ప్రకృతి {ప్రకృతి – చావు పుట్టుకల చక్రము లక్షణముగ కలది}; లేకుండును = లేకుండగ పోవును, అణగును; అనియు = అనియును; ప్రకృతి = ప్రకృతి; అడంగుటయ = అణగుటయే; నైర్గుణ్యంబు = నిర్గుణత్వము; అనియును = అనియును; నైర్గుణ్యంబు = నైర్గుణ్యము; వలనన్ = వలన; కార్యలింగ = ప్రారబ్దలింగ శరీరము {కార్యలింగం - ప్రారబ్దలింగ శరీరము – ప్రకృతి లక్షణముల ద్వారా కలిగినది ప్రారబ్దము}; నాశంబు = నాశనమగు; అనియును = అనియును; కార్యలింగ = కార్యలింగ; నాశంబున = నాశనమున; అసంభవంబు = ముక్తి {అసంభవము - జన్మరాహిత్యము, ముక్తి}; అగున్ = కలుగును; ప్రకృతిన్ = ప్రకృతిని; పాసి = విడచి; క్రమ్మఱన్ = మరల; స్థూల = స్థూలమైన, భౌతిక; శరీర = శరీరము; ప్రాప్తుండున్ = పొందినవాడు; కాక = అవ్వకుండక; పురుషుండు = జీవుడు; సమ్యగ్భోగంబునన్ = సమ్యగ్భోగము యందు {సమ్యగ్భోగము - చక్కటి అనుభవము}; ఉండున్ = ఉండును; అనియును = అనియును; నిశ్చయించి = నిశ్చయించుకొని; అర్జునుండు = అర్జునుడు; విరక్తుండు = విరక్తి చెందినవాడు; ఐ = అయి; ఊరక = ఊరకనే; ఉండెన్ = ఉండెను; ధర్మజుండు = యమధర్మరాజు పుత్రుడు, ధర్మరాజు; భగవదీయ = భగవంతుని యొక్క; మార్గంబున్ = మార్గమును, పోవుటను; తెలిసి = తెలిసికొని; యాదవుల = యాదవుల; నాశంబు = మరణము; విని = విని; నారదు = నారదుని యొక్క; వచనంబులన్ = మాటలను; తలంచి = స్మరించి; నిశ్చల = చలింపని; చిత్తుండు = మనస్సు కలవాడు; ఐ = అయి; స్వర్గ = స్వర్గమునకు పోవు; మార్గ = దారి వెంట – మార్గము వెంట; గమనంబున = వెళ్ళుట; కున్ = కు; యత్నంబు = ప్రయత్నము; చేయుచుండెన్ = చేయుచుండెను; ఆ = ఆ; సమయంబున = సమయమున.

భావము:

అని ఈ విధంగా అర్జునుడు అన్నకు చెప్పి దేశకాలాలను అనుసరించేవి, మానసిక సంతాపాన్ని శమింపజేసేవీ ఐన వాసుదేవుని వాక్కులు స్మరించుకొని పరమేశ్వరాయత్తమైన చిత్తంతో మౌనం వహించాడు. సంతత గోవింద చరణారవింద సంస్మరణంచేత స్వచ్ఛమైన బుద్ధికలవాడై శోకాన్ని విసర్జించాడు. నిరంతర ధ్యానరూపమైన భక్తివిశేషంతో కామక్రోధాదులను జయించాడు. పూర్వం కురుక్షేత్రంలో కౌరవ పాండవ సేనామధ్యంలో భగవానుడైన వాసుదేవుడు తనకు బోధించిన గీతావాక్యాలు మననం చేసుకొన్నాడు. కాలానుగుణంగా కర్మలను అనుభవించటంచేత మరుగుపడిన గీతావిజ్ఞానాన్ని మళ్లీ అందుకొన్నాడు. అర్జునుడు కార్యకారణభావాన్ని అనుసరించి శోకానికి అహంకార మమకారాలతో కూడిన ద్వైతభ్రాంతి కారణమని, ఆ ద్వైతభ్రాంతికి శరీరం కారణమనీ, ఆ శరీరానికి లింగం కారణమనీ, ఆ లింగానికి గుణాలు కారణమనీ, ఆ గుణాలకు ప్రకృతి కారణమమనీ గ్రహించాడు. “అహం బ్రహ్మాస్మి” అనే జ్ఞానంతో ప్రకృతి విలీనమైపోతుందని. ప్రకృతి నశించిపోవటమే గుణారాహిత్యమనీ, గుణరాహిత్యమే పురుషుడు తిరిగి స్థూల శరీరాన్ని పొందక బ్రహ్మైక్యాన్ని పొందుతాడని నిశ్చయించుకొని అర్జునుడు విరక్తుడైనాడు. ధర్మరాజు భగవంతుడైన శ్రీకృష్ణుని అవతార సమాప్తిని, యాదవుల వినాశనాన్ని విని, నారదుని ప్రబోధ వాక్కులు, అచంచల వాక్కులు తలంచుకొని, అచంచల హృదయుడై పుణ్యలోక ప్రాప్తికి ప్రయత్నించ సాగాడు.

1-382-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దువుల నాశము మాధవు
వియు విని కుంతి విమలక్తిన్ భగవ
త్పచింతాతత్పరయై
ముమున సంసారమార్గమునకుం బాసెన్.

టీకా:

యదువుల = యాదవుల; నాశము = మరణము; మాధవు = కృష్ణుడు {మాధవుడు – మాధవి (లక్ష్మీదేవి) భర్త, కృష్ణుడు}; పదవియు = పైకి వెళ్ళుటయు; విని = విని; కుంతి = కుంతి; విమల = నిర్మలమైన; భక్తిన్ = భక్తితో; భగవత్ = భగవంతుని యొక్క; పద = పాదములమీది; చింతా = ధ్యానము యందు; తత్పర = ఆసక్తి కలది; ఐ = అయి; ముదమున = సంతోషముతో; సంసార = సంసారము అను; మార్గమున = మార్గము; కున్ = నుండి; పాసెన్ = దూరమాయెను, మరణించెను.

భావము:

యాదవు మరణమూ, మాధవుని నిర్యాణము ఆలకించిన కుంతీదేవి నిర్మలమైన భక్తితో హరిచరణ సంస్మరణంలో ఆసక్తురాలై ప్రశాంతంగా శరీరాన్ని పరిత్యజించింది.

1-383-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లు కంటకంబునం గంటకోన్మూలనంబు సేసి కంటకంబులు రెంటినిపరిహరించు విన్నాణి తెఱంగున యాదవ రూప శరీరంబునం జేసియీశ్వరుండు లోక కంటక శరీరంబులు సంహరించి నిజ శరీరంబువిడిచె; సంహారంబునకు నిజ శరీర పర శరీరంబులు రెండు నీశ్వరునకు సమంబులు, నిజరూపంబున మెలంగుచు రూపాంతరంబులు ధరియించి క్రమ్మఱ నంతర్ధానంబు నొందు నటుని కైవడి లీలా పరాయణుండైన నారాయణుండు, మీన కూర్మాది రూపంబులుధరియించుఁ బరిహరించు" నని చెప్పి మఱియు నిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; కంటకంబునన్ = ముల్లుతో; కంటక = ముల్లు; ఉన్మూలనంబున్ = పెల్లగించుట; చేసి = చేసి; కంటకంబులు = ముల్లులను; రెంటిని = రెండింటిని; పరిహరించు = విసర్జించు; విన్నాణి = నేర్పు కలవాని; తెఱంగునన్ = వలె; యాదవ = యాదవుని వంటి; రూప = రూపము కల; శరీరంబునన్ = శరీరము; చేసి = వలన; ఈశ్వరుండు = భగవంతుడు; లోక = లోకమునకు; కంటక = ముల్లుల వంటి, బాధించు; శరీరంబులు = శరీరధారులను; సంహరించి = సంహరించి; నిజ = తన; శరీరంబు = శరీరమును; విడిచెన్ = విడిచిపెట్టెను; సంహారంబు = సంహరించుట; కున్ = కు; నిజ = తన; శరీర = శరీరము; పర = ఇతరుల; శరీరంబులు = శరీరములు; రెండున్ = రెండును; ఈశ్వరు = భగవంతున; కున్ = కు; సమంబులు = సమానములు; నిజ = తన; రూపంబునన్ = రూపములో; మెలంగుచున్ = జీవించి ఉండి; రూప = రూపములు, వేషములు; అంతరంబులు = ఇతరమైనవి; ధరియించి = ధరించి; క్రమ్మఱన్ = మరల; అంతర్ధానంబు = మాయమగుటను; పొందు = పొందెడి; నటుని = నటుని; కైవడిన్ = వలె; లీలా = లీలకు; పరాయణుండు = ఆశ్రయము అయినవాడు; ఐన = అయినట్టి; నారాయణుండు = భగవంతుడు; మీన = చేప; కూర్మ = తాబేలు; ఆది = మొదలగు; రూపంబులు = రూపములు; ధరియించున్ = తాల్చును; పరిహరించున్ = విడిచిపెట్టును; అని = అని; చెప్పి = చెప్పి; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ఈ విధంగా కంటకంతో మరో కంటకాన్ని పెకలించి, రెండు కంటకాలనూ దూరంగా పారవేసే వివేకవంతునిలాగా, పరమేశ్వరుడు యాదవశరీరం ధరించి జగత్కంటకాలైన పరుల శరీరాలను అంత మొందించి తన శరీరాన్ని వదిలిపెట్టాడు. పరమేశ్వరునికి సంహార విషయంలో స్వపరదేహాలనే భేదం లేదు. రెండూ సమానమే, స్వస్వరూపంతో ప్రవర్తిస్తూ, అన్యరూపాలు పెక్కులు ధరించి, మళ్లీ స్వస్వరూపాన్ని పొంచే నటునిలాగా విచిత్రలీలావిలాసుడైన వైకుంఠవాసుడు మత్స్యకూర్మాది అవతారాలు ధరిస్తూ, పరిహరిస్తూ ఉంటాడు.

1-384-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"ఏ దినమున వైకుంఠుఁడు
మేదినిపైఁ దాల్చినట్టి మేను విడిచినాఁ
డా దినమున నశుభప్రతి
పాక మగు కలియుగంబు ప్రాప్తం బయ్యెన్.

టీకా:

ఏ = ఏ; దినమున = రోజు; వైకుంఠుఁడు = విష్ణువు {వైకుంఠుడు - వైకుంఠమున ఉండువాడు; విష్ణువు}; మేదినిపైన్ = భూమి మీద; తాల్చిన = ధరించిన; అట్టి = అటువంటి; మేను = శరీరము; విడిచినాఁడు = విడచిపెట్టెనో; ఆ = ఆ; దినమునన్ = రోజు; అశుభ = అశుభమునకు; ప్రతిపాదకము = మొదలు పెట్టునది; అగు = అయిన; కలియుగంబు = కలి యుగము; ప్రాప్తంబు = మొదలు; అయ్యెన్ = అయ్యెను.

భావము:

"శ్రీమన్నారాయణుడు లీలానుషరూపాన్ని దాల్చి ఏనాడు అవతారసమాప్తి కావించాడో ఆనాడే అమంగళ దాయకమైన కలియుగం ఆరంభమయింది.

1-385-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లివర్తనంబునఁ గ్రౌర్యహింసాసత్య;
దంభకౌటిల్యాద్యర్మ చయము
పురముల గృహముల భూములఁ దమలోనఁ;
లుగుట దలపోసి రిపురమున
నుమని రాజవై ను మని దీవించి;
సింధుతోయకణాభిషిక్తుఁ జేసి
నిరుద్ధనందనుండైన వజ్రునిఁ దెచ్చి;
ధురఁ బట్టము గట్టి మతఁ బాసి

1-385.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రుల హరుల భటులఁ గంకణాదికముల
మంత్రిజనుల బుధుల మానవతుల
ఖిల మయిన ధనము భిమన్యుసుతునకు
ప్పగించి బుద్ధి నాశ్రయించి.

టీకా:

కలి = కలికాలము; వర్తనంబునన్ = ప్రవర్తిల్లుటలో, నడచుటలో; క్రౌర్య = క్రూరత్వము; హింస = హింస; అసత్య = అసత్యము; దంభ = దంభము; కౌటిల్య = కుటిలత్వము; ఆది = మొదలగు; అధర్మ = అధర్మముల; చయము = సమూహము; పురముల = జనవాస; గృహముల = నివాస; భూములన్ = ప్రదేశములలోను; తమ = తమ; లోనన్ = లోను; కలుగుటన్ = ఏర్పడుటను; తలపోసి = తెలిసికొని; కరిపురమున = హస్తినాపురములో; మనుమని = పౌత్రుని, మనవడుని; రాజవు = రాజు; ఐ = అయ్యి; మనుము = జీవించుము; అని = అని; దీవించి = ఆశీర్వదించి; సింధు = సింధు నది యొక్క – సముద్రపు; తోయ = నీటి; కణ = బిందువులతో; అభిషిక్తున్ = పట్టాభిషేకమును {అభిషేకము చేయుట –పట్టాభిషేకము}; చేసి = చేసి; అనిరుద్ధ = అనిరుద్ధుని యొక్క; నందనుండు = పుత్రుడు; ఐన = అయినట్టి; వజ్రునిన్ = వజ్రుని; తెచ్చి = తీసుకువచ్చి; మధురన్ = మధురను; పట్టమున్ = పట్టము {పట్టము - రాజ్యాభిషేక కాలమున నుదట కట్టెడు పట్టీ}; కట్టి = కట్టి, పట్టాభిషేకముచేసి; మమతన్ = మమత్వము, మమకారమును; పాసి = తొలగించుకొని;
కరులన్ = ఏనుగులను; హరులన్ = గుఱ్ఱములను; భటులన్ = భటులను; కంకణ = కంకణములు; ఆదికముల = మొదలగువానిని; మంత్రి = మంత్రాగము చెప్పువారి; జనులన్ = సమూహమును; బుధులన్ = పండితులను, జ్ఞానులను; మానవతులన్ = మానము కల స్త్రీలను; అఖిలము = సమస్తము; అయిన = అయినట్టి; ధనమున్ = సంపదలను; అభిమన్యు = అభిమన్యుని; సుతున = పుత్రున, పరీక్షిత్తున; కున్ = కు; అప్పగించి = అప్పచెప్పి; బుద్ధిన్ = జ్ఞానమును; ఆశ్రయించి = ఆశ్రయించి, అండగొని.

భావము:

కలి ప్రవేశం వల్ల క్రౌర్యం, హింస, అసత్యం, ఆడంబరం, కౌటిల్యం మొదలైన వానితో అధర్మచక్రం పట్టణాలలో, పల్లెలలో, గృహాలలో, సమస్త ప్రదేశాలలో విస్తరించిందని తెలుసుకొన్న ధర్మరాజు తన మనుమడైనను పరీక్షిత్తును రాజును కావించి హస్తినాపుర సింహాసనం పైన కూర్చుండబెట్టాడు. పవిత్ర సింధుజలాలతో అభిషేకించి ఆశీర్వదించాడు. అనిరుద్ధుని కుమారడైన వజ్రుణ్ణి మధురా రాజ్యానికి అధిపతి చేసాడు. మమకారాలను పరిత్యజించి ఏనుగులు గుఱ్ఱాలు, సైనికులు, కంకణాది ఆభరణాలు, అమాత్యులు, విద్వాంసులు, స్ర్తీలు మొదలైన సకల ధన కనక వస్తు వాహనాలను అభిమన్యు నందనుడైన పరీక్షిత్తుకు అప్పగించి ధర్మనందనుడు వైరాగ్యమార్గాన్ని ఆశ్రయించాడు.

1-386-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

విరక్తుండైన ధర్మనందనుండు ప్రాజాపత్యం బనియెడి యిష్టిఁ గావించి యగ్నుల నాత్మారోపణంబు సేసి నిరహంకారుండును నిర్దళితాశేష బంధనుండును నై సక లేంద్రియంబుల మానసంబున నడంచి ప్రాణాధీనవృత్తి యగు మానసంబునుఁ బ్రాణమందునుఁ, బ్రాణము నపానమందును, నుత్సర్గసహితం బయిన యపానము మృత్యువునందును, మృత్యువును పంచభూతంబులకు నైక్యంబైన దేహంబు నందును, దేహము గుణత్రయంబు నందును, గుణత్రయంబు నవిద్య యందును, సర్వారోపహేతువగు నవిద్యను జీవుని యందును, జీవుండయిన తన్ను నవ్యయం బయిన బ్రహ్మ మందును, లయింపంజేసి బహిరంతరంగ వ్యాపారంబులు విడిచి, నార చీరలు ధరియించి, మౌనియు నిరాహారుండును ముక్తకేశుండునునై యున్మత్త పిశాచ బధిర జడుల చందంబున నిరపేక్షకత్వంబున.

టీకా:

విరక్తుండు = రక్తిని విసర్జించినవాడు; విరక్తుడు; ఐన = అయినట్టి; ధర్మనందనుండు = ధర్మరాజ; ప్రాజాపత్యంబు = పాజాపత్యము; అనియెడి = అనెడి; ఇష్టిన్ = యజ్ఞమును; కావించి = చేసి; అగ్నులన్ = అగ్నులను; ఆత్మ = తనలో; ఆరోపణంబున్ = ఆరోపించుకొనుటను; చేసి = చేసి; నిరహంకారుండును = అహంకారములేనివాడును; నిర్దళిత = చక్కగా భేధించబడిన; అశేష = సమస్తమైన; బంధనుండును = బంధములు కలవాడును; ఐ = అయి; సకల = సర్వమైన; ఇంద్రియంబులన్ = ఇంద్రియములను; మానసంబునన్ = మనసునందు; అడంచి = అణగకొట్టి; ప్రాణ = ప్రాణములకు; అధీన = లొంగి; వృత్తి = వ్యవహరించునది; అగు = అయినట్టి; మానసంబును = మనసును; ప్రాణము = ప్రాణము; అందునున్ = లోను; ప్రాణమున్ = ప్రాణమును; అపానము = అపానము; అందునున్ = లోను; ఉత్సర్గ = వెలువడుట అను లక్షణముతో; సహితంబు = కూడునది; అయిన = అయినట్టి; అపానమున్ = అపానమును; మృత్యువున్ = మృత్యువు; అందునున్ = లోను; మృత్యువును = మృత్యువును; పంచ = ఐదు; భూతంబులు = భూతములు {పంచ భూతములు - భూమి నీరు వాయువు అగ్ని ఆకాశము}; కున్ = కు; ఐక్యంబు = కూడిక; ఐన = అయినట్టి; దేహంబున్ = దేహము; అందున్ = లోను; దేహమున్ = దేహమును; గుణ = గుణములు; త్రయంబున్ = మూడింటి {గుణ త్రయము - సత్త్వ, రజో, తమో గుణములు}; అందునున్ = లోను; గుణ = గుణములు; త్రయంబున్ = మూడింటిని; అవిద్య = అవిద్య; అందునున్ = లోను; సర్వ = సమస్తమైన; ఆరోప = మిథ్యాజ్ఞానమునకు; హేతువు = కారణము; అగు = అయినట్టి; అవిద్యను = అవిద్యను; జీవుని = జీవుని; అందునున్ = లోని; జీవుండు = జీవుడు; అయిన = అయినట్టి; తన్నున్ = తనను; అవ్యయంబు = తరుగనిది; అయిన = అయినట్టి; బ్రహ్మమున్ = బ్రహ్మము; అందునున్ = లోను; లయింపన్ = లీనము అగునట్లు; చేసి = చేసి; బహిర్ = బయటి; అంత = లోపలి; రంగ = విషయములయొక్క; వ్యాపారంబులు = వర్తనలు; విడిచి = విడిచిపెట్టి; నార = నారతో నేసిన; చీరలు = వస్త్రములను; ధరియించి = ధరించి; మౌనియున్ = మౌనమును వహించినవాడును; నిరాహారుండును = ఆహారమును వర్జించినవాడును; ముక్త = వదిలివేసిన; కేశుండును = కేశములు కలవాడును; ఐ = అయి; ఉన్మత్త = పిచ్చివాడు; పిశాచ = పిశాచము పట్టినవాడు; బధిర = చెవిటివాడు; జడుల = మందమైన మతి కలవార్ల; చందంబునన్ = వలె; నిరపేక్షకత్వంబునన్ = నిరపేక్షతో {నిరపేక్షణ - దేనియందును కుతూహలము లేకుండు}.

భావము:

విరక్తుడైన ధర్మరాజు ప్రాజాపత్యమనే యాగం చేసి గార్హపత్యం మొదలైన అగ్నులను ఆత్మయందు ఆరోపించుకొన్నాడు. నిరహంకారుడై సంసారబంధాలు తెగతెంపులు చేసి వాక్కు మొదలైన ఇంద్రియాలను మనస్సునందూ, మనస్సును ప్రాణమందూ, ప్రాణాన్ని అపానమందూ అపానాన్ని మృత్యువునందూ, మృత్యువును పాంచభౌతికమైన శరీరమందూ, శరీరాన్ని సత్త్వరజస్తమో గుణములందూ, ఆ గుణత్రయాన్ని అవిద్యయందూ, అరోపా లన్నిటికి హేతువైన అవిద్యను జీవాత్మయందూ, జీవాత్మను అవ్యయమైన పరమాత్మయందూ లయింపజేశాడు. సర్వసంగ పరిత్యాగియై నార చీరలు ధరించాడు. మౌనంతో నిరాహారుడై ముక్తకేశుడై, పిచ్చివాని వలె, పిశాచగ్రస్తుని వలె, బధిరుని వలె, జడుని వలె నిరపేక్షుడైనాడు.

1-387-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

చిత్తంబున బ్రహ్మము నా
వృత్తముఁ గావించుకొనుచు విజ్ఞానధనా
త్తులు దొల్లి వెలింగెడి
యుత్తరదిశ కేఁగె నిర్మలోద్యోగమునన్.

టీకా:

చిత్తంబున = మనస్సునందు; బ్రహ్మమున్ = పరబ్రహ్మమును; ఆవృత్తమున్ = స్మరించుటను, ధ్యానమును; కావించుకొనుచున్ = చేసుకొనుచు; విజ్ఞాన = విజ్ఞానము అను; ధన = సంపదను; ఆయత్తులున్ = కూడబెట్టుకొన్నవారు; తొల్లి = పూర్వము; వెలింగెడి = ప్రకాశించెడి; ఉత్తర = ఉత్తరము; దిశ = దిక్కున; కున్ = కు; ఏఁగెన్ = వెళ్ళెను; నిర్మల = నిర్మలమైన; ఉద్యోగమునన్ = ప్రయత్నముతో.

భావము:

మనస్సులో పరబ్రహ్మాన్ని మననం చేసుకొంటూ పూర్వం విజ్ఞానవంతులైన మహానుభావులు అనుసరించిన ఉత్తర దిక్కుగా ఏకాగ్రచిత్తంతో ప్రస్థానం సాగించాడు ధర్మనందనుడు.

1-388-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అంత నాతని తమ్ము నిలపుత్త్రాదులు;
లిరాకచేఁ బాపర్ము లగుచుఁ
రియించు ప్రజల సంచారంబు లీక్షించి;
ఖిల ధర్మంబుల నాచరించి
వైకుంఠ చరణాబ్జ ర్తిత హృదయులై;
ద్భక్తినిర్మలత్వమునుఁ జెంది
విషయయుక్తులకుఁ బ్రవేశింపఁగా రాక;
నిర్ధూతకల్మష నిపుణమతులు

1-388.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

హుళవిజ్ఞానదావాగ్ని సితకర్ము
లైన యేకాంతులకు లక్ష్యమై వెలుంగు
ముఖ్యనారాయణస్థానమునకుఁ జనిరి
విగతరజమైన యాత్మల విప్రముఖ్య!

టీకా:

అంతన్ = అంతట; ఆతని = అతనియొక్క; తమ్ములు = తమ్ముళ్ళు; అనిలపుత్ర = భీముడు {అనిలపుత్రుడు - వాయుదేవుని కొడుకు, భీముడు}; ఆదులు = మొదలగువారు; కలి = కలికాలము; రాక = వచ్చుట; చేన్ = చేత; పాప = పాపపు; కర్ములు = కర్మలుచేయువారు; అగుచున్ = అవుతూ; చరియించున్ = చరించు; ప్రజల = ప్రజలయొక్క; సంచారంబుల్ = ప్రవర్తనలు; ఈక్షించి = చూసి; అఖిల = సమస్తమైన; ధర్మంబులన్ = ధర్మబద్ధముగ చేయవలసిన కార్యములు; ఆచరించి = చేసి; వైకుంఠ = హరి {వైకుంఠుడు - వైకుంఠమున ఉండువాడు, విష్ణువు}; చరణ = పాదములు అను; అబ్జ = పద్మములవెంట {అబ్జము - నీటపుట్టునది, పద్మం}; వర్తిత = ప్రవర్తిల్లు; హృదయులు = హృదయము కలవారు; ఐ = అయ్యి; తత్ = ఆ; భక్తి = భక్తి యొక్క; నిర్మలత్వమునున్ = నిర్మలత్వమును; చెంది = చెంది; విషయ = ఇంద్రియార్థములందు; యుక్తుల = తగుల్కొని ఉండువారి; కున్ = కి; ప్రవేశింపఁగాన్ = ప్రవేసించుటకు; రాక = వీలుకాని; నిర్ధూత = క్షాళనముచేసికొన్న; కల్మష = కల్మషముకల; నిపుణ = నేర్పరి ఐన; మతులు = మనస్సులు కలవారు;
బహుళ = ఎక్కువ; విజ్ఞాన = విజ్ఞానము అను; దావాగ్నిన్ = కారుచిచ్చుచేత; భసిత = భస్మమైన; కర్ములు = కర్మ కలవారు; ఐన = అయినట్టి; ఏకాంతులు = ఏకాంతులు {ఏకాంతులు - ఉన్నది భగవంతుడు ఒక్కడే అన్న స్థితి లో ఉన్నవారు}; కున్ = కు; లక్ష్యము = గమ్యస్థానమైనది – కామిడి యైనది; ఐ = అయ్యి; వెలుంగు = ప్రకాశించు; ముఖ్య = ముఖ్యమైన; నారాయణ = విష్ణు {నారాయణుడు - నారములందువసించువాడు – హరి}; స్థానము = లోకము, సన్నిధి; కున్ = కి; చనిరి = వెళ్ళిరి; విగత = విడిచిపెట్టిన; రజము = రజోగుణము; ఐన = కలిగిన; ఆత్మల = ఆత్మలతో; విప్ర = బ్రాహ్మణులలో; ముఖ్య = ముఖ్యమైనవాడా.

భావము:

అనంతరం ధర్మజుని సోదరులైన భీమసేనాదులు కలిప్రభావంతో ప్రజలంతా పాపమార్గంలో సంచరించటం గమనించారు. దానధర్మాలు ఆచరించారు. శ్రీమన్నారాయణుని పాదపద్మాలను తమ హృదయంలో పదిలపరచుకొన్నారు. భగవద్భక్తిచే పరిశుద్ధ జీవనులైనారు. ఈ విధంగా వారు రజోగుణ రహితమైన హృదయాలతో విషయాసక్తులకు ప్రవేశింపరానిదీ, పాపరహితులూ, విజ్ఞాన సంపన్నులూ అయిన ఏకాంతభక్తులకు గమ్యస్థానమై వెలుగొందేదీ అయిన విష్ణు లోకాన్ని చేరుకున్నారు.

1-389-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అంత విదురుండు ప్రభాసతీర్థంబున హరియందుఁ జిత్తంబు సేర్చి, శరీరంబు విడిచి, పితృవర్గంబుతోడ దండధరుం డగుటం జేసి నిజాధికారస్థానంబునకుం జనియె; ద్రుపదరాజపుత్రియుఁ బతులవలన నుపేక్షితయై జగత్పతియైన వాసుదేవు నందుఁ జిత్తంబు సేర్చి తత్పదంబు సేరె నిట్లు.

టీకా:

అంతన్ = అంతట; విదురుండు = విదురుడు; ప్రభాస = ప్రభాసము అను {ప్రభాసము - మిక్కిలి భాసించునది}; తీర్థంబునన్ = స్నాన ఘట్టమున్న పుణ్య స్థలమున; హరి = భగవంతుని; అందున్ = లో; చిత్తంబున్ = మనస్సును; చేర్చి = చేర్చి; శరీరంబు = తనువును; విడిచి = వదిలి; పితృవర్గంబు = పితృదేవతలు; తోడన్ = తో; దండధరుండు = యముడు {దండధరుడు - దండము ధరించు వాడు, యముడు}; అగుటన్ = అగుట; చేసి = చే; నిజ = తనయొక్క; అధికార = అధికార ప్రవర్తన; స్థానంబు = పదము (యమ లోకము); కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; ద్రుపదరాజ = ద్రుపదరాజుయొక్క; పుత్రియున్ = కుమారియును; పతుల = భర్తల; వలనన్ = వలన; ఉపేక్షిత = అశ్రద్ధ చేయబడినది; ఐ = అయి; జగత్ = విశ్వమునకు; పతి = భర్త; ఐన = అయినట్టి; వాసుదేవున్ = కృష్ణుని {వాసుదేవుడు - ఆత్మలయందు వసించువాడు}; అందున్ = లో; చిత్తంబున్ = మనస్సును; చేర్చి = చేర్చి; తత్ = ఆతని; పదంబు = లోకమును, సన్నిధిని; చేరెన్ = చేరెను; ఇట్లు = ఈ విధముగ.

భావము:

తరువాత విదురుడు పవిత్రమైన ప్రభాసతీర్థంలో భగవంతుని యందు మనస్సు లగ్నంచేసి తన శరీరాన్ని త్యజించి, పూర్వజన్మలో యమధర్మరాజు అయినందువల్ల పితృదేవతలతో కలసి, తన అధికార పీఠాన్ని అధిష్ఠించాడు. ద్రౌపది నిరపేక్షులైన భర్తలచే ఉపేక్షతయై దేవదేవుడైన వాసుదేవుని యందు ఆసక్తమైన హృదయంతో పరమేశ్వర సాన్నిధ్యాన్ని పొందింది.

1-390-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

పాంవకృష్ణుల యానము,
పాండురమతి నెవ్వఁడైనఁ లికిన విన్నన్
ఖండితభవుఁడై హరిదా
సుండై కైవల్యపదము సొచ్చు నరేంద్రా!

టీకా:

పాండవ = పాండవులయొక్క; కృష్ణుల = కృష్ణుని యొక్క; యానము = ప్రయాణము; పాండుర = స్వచ్ఛమైన; మతిన్ = బుద్ధితో; ఎవ్వఁడు = ఎవడు; ఐనన్ = అయినప్పటికిని; పలికినన్ = చెప్పినను, స్మరించినను; విన్నన్ = విన్నను; ఖండితభవుఁడు = జన్మరాహిత్యుడు {ఖండితభవుడు - ఖండింపబడిన జన్మలు కలవాడు, జన్మరాహిత్యము}; ఐ = అయి; హరి = భగవంతునికి; దాసుండు = దాసుడు; ఐ = అయి; కైవల్యపదమున్ = మోక్షమును; పరమ పదమును; చొచ్చున్ = చేరును; నరేంద్రా = రాజా {నరేంద్రుడు - నరులకు ఇంద్రుడు; రాజు}.

భావము:

ఈ విధంగా జరిగిన పాండవుల మహాప్రస్థానమూ, శ్రీకృష్ణుని పరమపద యానమూ, స్వచ్ఛమైన హృదయంతో చదివినవాడూ, విన్నవాడూ, భవబంధ విముక్తుడై, పరమేశ్వర భక్తుడై కైవల్య పథాన్ని కైవసం చేసుకొంటాడు.