పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కృష్ణనిర్యాణంబు వినుట

  •  
  •  
  •  

1-380-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హీనాంగులకున్ బలాధికులకుం బ్రత్యర్థి భావోద్యమం
బులు గల్పించి, వినాశమున్ నెఱపి, యీ భూభారముం బాపి, ని
శ్చబుద్ధిం గృతకార్యుఁడై చనియె; నా ర్వేశ్వరుం, డచ్యుతుం,
ఘుం, డేమని చెప్పుదున్ భగవదాత్తంబు పృథ్వీశ్వరా!

టీకా:

బల = బలము; హీన = తక్కవగా కల; అంగుల = అంగములు కలవారి; కున్ = కిని; బల = బలము; అధికుల = అధికముగా కలవారి; కున్ = కిని; ప్రత్యర్థి = శత్రుత్వ; భావ = భావము యొక్క; ఉద్యమంబులు = ఉద్యమములు, ప్రయత్నములు; కల్పించి = ఏర్పరచి; వినాశమున్ = వినాశమును; నెఱపి = వ్యాపింపజేసి; ఈ = ఈ; భూ = భూమి యొక్క; భారమున్ = భారమును; పాపి = పొగొట్టి; నిశ్చల = నిశ్చలమైన; బుద్ధిన్ = బుద్ధితో; కృత = చేయవలసినది; కార్యుఁడు = చేసినవాడు; ఐ = అయి; చనియెన్ = దేహము వదలి వెళ్ళిపోయెను; ఆ = ఆ; సర్వేశ్వరుండు = కృష్ణుడు {సర్వేశ్వరుడు - సమస్తమునకు అధిపతి, భగవంతుడు, విష్ణువు, కృష్ణుడు}; అచ్యుతుండు = కృష్ణుడు {అచ్యుతుడు - చ్యుతము లేనివాడు, పతనము, నాశము లేనివాడు, స్థిరుడు, విష్ణువు, కృష్ణుడు}; అలఘుండు = కృష్ణుడు {అలఘుడు - (ఏవిధముగను) తక్కువ కాని వాడు, కృష్ణుడు, విష్ణువు}; ఏమి = ఎమిటి; అని = అని; చెప్పుదున్ = చెప్పమన్నావు; భగవత్ = భగవంతుని; ఆయత్తంబు = ఆధీనము; పృథ్వీశ్వరా = ప్రభువా {పృథ్వీశ్వరుడు - పృథివికి ఈశ్వరుడు, రాజు.}.

భావము:

పృథ్వీనాథా! బలవంతులైన వారికీ బలహీనులైన వారికీ నడుమ పగలు కల్పించి, పరస్పర సంహారం చేయించి, ఈ భూభారాన్ని తీర్చి ఆ అచ్యుతుడు, ఆ అప్రమేయుడు, ఆ అఖిలేశ్వరుడు, ఆ శ్రీకృష్ణుడు వచ్చిన కార్యం పూర్తి చేసుకొని నిబ్బరంగా, నిశ్చలంగా వెళ్లిపోయాడు. ఇంకా ఏమి చెప్పేది ఆ సర్వేశ్వరుని సంకల్పం ప్రకారం జరిగిపోయింది.