పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కృష్ణనిర్యాణంబు వినుట

  •  
  •  
  •  

1-379-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ములు గల మీనంబులు
విరహితమీనములను క్షించు క్రియన్
వంతు లయిన యదువులు
రహితులఁ జంపి రహితభావముల నృపా!

టీకా:

బలములు = బలము; కల = కలిగిన; మీనంబులు = చేపలు; బల = బలము; విరహిత = లేని; మీనములను = చేపలను; భక్షించు = తినెడి; క్రియన్ = విధముగ; బల = బలము; వంతులు = కలవారు; అయిన = అయినట్టి; యదువులు = యాదవులు; బల = బలము; రహితులన్ = లేనివారిని; చంపిరి = సంహరించిరి; అహిత = శత్రు; భావముల = భావములతో; నృపా = రాజా {నృప - నృ (నరులను) ప (పరిపాలించువాడు), రాజు.}.

భావము:

పెద్దచేపలు అనేక చిన్నచేపలను గుట్టుక్కున మింగుతాయి. అలా యాదవులలో బలవంతులు తమలో తాము తమకంటే బలహీను లందరిని పగబట్టినట్లు చంపేసారు. అవును జీవులు జీవుల వలననే పుట్టింపబడతారు; పోషింపబడతారు; అంతరింపబడతారు కదా! (ఆవిధంగా అనితరసాధ్యు లైన యాదవులు తుడుచుపెట్టుకుపోయా రని ద్వారకనుండి తిరిగి వచ్చిన అర్జునుడు అన్నగారికి తెలిపాడు.)