పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కృష్ణనిర్యాణంబు వినుట

  •  
  •  
  •  

1-377-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దువీరుల్ మునినాథుశాపమునఁ గాలాధీనులై, యందఱున్
దిరాపాన వివర్ధమాన మదసమ్మర్దోగ్ర రోషాంధులై
నంబుల్ దమలోన ముష్టిహతులం గావించి నీఱైరి న
ష్టశం జిక్కిరి నల్వు రేవు రచటన్ ర్వంసహావల్లభా!

టీకా:

యదు = యాదవ; వీరుల్ = వీరులు; మునినాథు = దూర్వాసుని; శాపమునన్ = శాపము వలన; కాల = కాలమునకు; ఆధీనులు = లొంగినవారు; ఐ = అయి; అందఱున్ = అందరును; మదిరా = మద్యమును; పాన = త్రాగుటచేత; వివర్ధమాన = పెచ్చుపెరిగిన; మద = మదముతోను; సమ్మర్ద = ఘర్షణలతోను; ఉగ్ర = భయంకరమైన; రోష = రోషముతోను, కినుకతోను; అంధులు = గ్రుడ్డివారు; ఐ = అయి; కదనంబుల్ = యుద్ధములు; తమలోన = తమలోతామే; ముష్టి = పిడికిలి; హతులన్ = పోటులను; కావించి = చేసుకొని; నీఱైరి = భస్మమైరి; నష్ట = నశించే; దశన్ = అవస్థను; చిక్కిరి = తగ్గిరి, కృశించిరి, తగులుకొనిరి; నల్వురు = నలుగురేసి; ఏవురు = ఐదుగురేసి; అచటన్ = అక్కడ; సర్వంసహావల్లభా = ప్రభూ {సర్వంసహావల్లభుడు - సర్వంసహా (భూమికి) రాజు, ప్రభువు.}.

భావము:

ధరణీవల్లభా! ఇంతకు ముందు మీరు పేర్కొన్న యాదవ వీరులంతా విధివైపరీత్యం వల్ల మునిశాపోపహతులై, వారందరూ మద్యపానం చేసిన మత్తులో మైమరిచి, ఆగ్రహావేశంతో ద్వేషరోషాలతో కన్నూ మిన్నూ కానక తమలో తాము పోరాడుకొన్నారు. ముష్టిఘాతాలతో పరస్పరం కొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకొన్నారు. పోయినవారు పోగా నలుగు రైదుగురు మాత్రం ఎలాగో బ్రతికి బయటపడ్డారు.