పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కృష్ణనిర్యాణంబు వినుట

  •  
  •  
  •  

1-372-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వారిజగంధులు దమలో
వారింపఁగరాని ప్రేమ వాదము సేయన్,
వారిజనేత్రుఁడు ననుఁ దగ
వారిండ్లకుఁ బనుపు నలుక వారింప నృపా!

టీకా:

వారిజగంధులున్ = సుందరీమణులు {వారిజగంధి - వారిజ (పద్మముల)యొక్క గంధి (సువాసనగలామె) ఉత్తమస్త్రీ, పద్మినీజాతి స్త్రీ}; తమ = తమ; లోన్ = మధ్యన; వారింపఁగరాని = తీర్చలేని; ప్రేమ = ప్రణయ; వాదమున్ = కలహమును; చేయన్ = చేయగా; వారిజనేత్రుఁడు = కృష్ణుడు {వారిజనేత్రుఁడు - పద్మములవంటి కన్నులు కలవాడు, కృష్ణుడు}; ననున్ = నన్ను; తగన్ = తగ, సరిగ; వారి = వారియొక్క; ఇండ్ల = నివాసముల; కున్ = కు; పనుపున్ = పంపును; అలుక = అలక (కోప విశేషము); వారింప = పోగొట్టుటకు; నృపా = రాజా {నృపుడు - నృ (నరులను) పాలించువాడు, రాజు}.

భావము:

అప్పుడప్పుడు తనకు అంతఃపుర కాంతలతో ప్రణయకలహం సంభవించినప్పుడు వారి పొలయలుకను తీర్చటం కోసం నన్ను బ్రతిమాలి వారి యిండ్లకు పంపే వారిజాక్షుని ఏ విధంగా విస్మరించగలం? ప్రభూ!