పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కృష్ణనిర్యాణంబు వినుట

  •  
  •  
  •  

1-371-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వియ, ధనంజయ, హనుమ
ద్ధ్వ, ఫల్గున, పార్థ, పాండునయ, నర, మహేం
ద్ర, మిత్రార్జున, యంచును
భుములు తలకడవ రాకపోకలఁ జీరున్.

టీకా:

విజయ = అర్జున {విజయుడు - విజయశీలము కలవాడు, అర్జునుడు}; ధనంజయ = అర్జున {ధనంజయుడు - ధనమును (అశ్వమేధ యజ్ఞమునకు వలసిన ధనమును) జయించినవాడు, అర్జునుడు}; హనుమద్ధ్వజ = అర్జున {హనుమద్వజుడు - హనుమంతుని జండాపై కలవాడు, అర్జున}; ఫల్గున = అర్జున {ఫల్గున - ఉత్తర ఫల్గుని నక్షత్రము నందు పుట్టినవాడు, వేగముగా పాదరసం వలె ప్రసరించువాడ, అర్జున}; పార్థ = అర్జున {పార్థుడు - పృథు (కుంతి) కొడుకు, అర్జునుడు.}; పాండుతనయ = అర్జున {పాండుతనయుడు - పాండురాజు పుత్రుడు, అర్జునుడు}; నర = అర్జున {నరుడు - నరనారాయణులలో నరుడు, అర్జునుడు}; మహేంద్రజ = అర్జున {మహేంద్రజుడు - మహేంద్రుని పుత్రుడు, అర్జున}; మిత్ర = మిత్రుడ, {మిత్రుడు - 1.హితుడు, 2.కొలతలు వేయుటలో నేర్పరి, 3.సూర్యుని వలె నిస్వార్థం గలవాడు, 4.అర్జునుడు, 5.మితము అను దేశ, కాల, ద్రవ్య ముల కొలతలకు అధిదేవత, 6.ద్వాదశాదిత్యులలో ఒకడు, సూర్యుడు}; అర్జున = అర్జున {అర్జునుడు - తెల్లని వాడు, పాండవ మధ్యముడు, కుంతీదేవి రెండవ కొడుకు}; అంచును = అనుచును; భుజములున్ = చేతులు; తలకడవన్ = అతిక్రమించగా, చాచి; రాకపోకలన్ = రాకపోకలందు; చీరున్ = పిలుచును.

భావము:

అటు ఇటు తిరుగుతున్నప్పుడల్లా చేతులు చాచి ఆప్యాయంగా తట్టుతు విజయ, ధనంజయ, హనుమద్ధ్వజ, ఫల్గున, పార్థ, పాండుతనయ, నర, మహేంద్రజ, మిత్రమ, అర్జున అంటు రకరకాలుగా చనువుగా నన్ను పిలిచేవాడు కదా!