పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కృష్ణనిర్యాణంబు వినుట

  •  
  •  
  •  

1-370-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చెలికాఁడ రమ్మని చీరు న న్నొకవేళ,-
న్నించు నొకవేళ ఱఁది యనుచు,
బంధుభావంబునఁ బాటించు నొకవేళ,-
దాతయై యొకవేళ నము లిచ్చు,
మంత్రియై యొకవేళ మంత్ర మాదేశించు,-
బోధియై యొకవేళ బుద్ధి సెప్పు,
సారథ్య మొనరించుఁ నవిచ్చి యొకవేళఁ,-
గ్రీడించు నొకవేళ గేలి సేయు,

1-370.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నొక్క శయ్యాసనంబున నుండుఁ, గన్న
తండ్రి కైవడిఁ జేసిన ప్పుఁ గాచు,
స్తములు వట్టి పొత్తున నారగించు,
నుజవల్లభ! మాధవు ఱవ రాదు.

టీకా:

చెలికాఁడ = మిత్రుడా; రమ్ము = రా; అని = అని; చీరున్ = పిలుచును; నన్ను = నన్ను; ఒక = ఒక; వేళ = సమయమందు; మన్నించున్ = గౌరవించును; ఒక = ఒక; వేళ = సమయమందు; మఱఁది = బావమరిది, చెల్లెలు భర్త; అనుచు = అనుచును; బంధు = చుట్టరికపు; భావంబునన్ = భావమును, ఆత్మీయతను; పాటించు = వ్యవహరించును; ఒక = ఒక; వేళ = సమయమందు; దాత = దానమిచ్చువాడు; ఐ = అయ్యి; ఒక = ఒక; వేళ = సమయమున; ధనములు = ధనములను; ఇచ్చు = ఇచ్చును; మంత్రి = మంత్రి {మంత్రి - మంత్రాంగమున సహాయము చేయువాడు}; ఐ = అయ్యి; ఒక = ఒక; వేళ = సమయమందు; మంత్రము = ఆలోచనా వ్యూహము; ఆదేశించు = ఆజ్ఞాపించును; బోధి = బోధించువాడు; ఐ = అయ్యి; ఒక = ఒక; వేళ = సమయమందు; బుద్ధి = నీతి; చెప్పు = చెప్పు; సారథ్యము = రథసారథ్యము; ఒనరించున్ = చేయును; చనవు = అనురాగము; ఇచ్చి = ఇచ్చి; ఒక = ఒక; వేళన్ = సమయమందు; క్రీడించున్ = ఆటలాడును; ఒక = ఒక; వేళ = సమయమందు; గేలి = ఎగతాళి; చేయు = చేయును; ఒక్క = ఒకే;
శయ్యాసనంబున = పాన్పునందు; ఉండున్ = ఉండును; కన్న = జన్మనిచ్చిన; తండ్రి = తండ్రి; కైవడిన్ = వలె; చేసిన = చేసిన; తప్పున్ = తప్పులను; కాచు = కాయును; హస్తములున్ = చేతులు; వట్టి = పట్టుకొని; పొత్తునన్ = కలిసి; ఆరగించు = భుజించు; మనుజవల్లభ = రాజా {మనుజవల్లభ - మానవులకు భర్త, రాజు}; మాధవు = కృష్ణుని యొక్క {మాధవుడు - మాధవి భర్త, విష్ణువు}; మఱవ = మరచు విధము; రాదు = చేతకాదు.

భావము:

ఆ వాసుదేవునికి నేనంటే ఎంత ప్రేమ ఒక మాటు చెలికాడా రా రమ్మని పిలిచేవాడు. ఒకమాటు ముద్దుల మరదీ అని ముద్దు చేసేవాడు, ఒకమాటు ఆత్మబంధువై ఆదరించేవాడు. ఒకమాటు ఔదార్యమూర్తియై బహుధనాలు బహూకరించేవాడు. ఒకమాటు మంత్రియై హితోపదేశం చేసేవాడు. ఒకమాటు గురువై కర్తవ్యాన్ని బోధించేవాడు. మరొకమాటు సారథియై చనువు చూపేవాడు. ఒకమాటు కూడి ఆటలాతూ విహరించేవాడు, వేరొకమాటు ఆత్మీయుడై హాస్యమాడుతూ ఆటలు పట్టించేవాడు. ఇంకొక మాటు ఒకే ప్రక్కమీద కూర్చోపెట్టుకొని కన్నతండ్రి వలె నా తప్పులు సరిదిద్దేవాడు. మరొకమాటు నా చేతులు పట్టుకొని బలవంతం చేసి పొత్తున ఆరగింప జేసేవాడు. అటువంటి మాధవుణ్ణి మరచిపోవటం ఎలా మహారాజా?