పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కృష్ణనిర్యాణంబు వినుట

  •  
  •  
  •  

1-366.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్ణ సింధురాజ కౌరవేంద్రాదుల
లలపాగ లెల్లఁ డవి తెచ్చి
యే మహాత్ము బలిమి నిచ్చితి విరటుని
పుత్రి యడుగ బొమ్మపొత్తికలకు?

టీకా:

పంది = వరాహము; కై = కోసము; పోరాడ = యుద్ధము చేయగ; ఫాలాక్షుఁడు = శివుడు {ఫాలాక్షుడు - ఫాలమునందు కన్ను కలవాడు, శివుడు}; ఎవ్వని = ఎవని యొక్క; బలమునన్ = శక్తివలన; నాకు = నాకు; ఇచ్చెన్ = ఇచ్చెను; పాశుపతమున్ = పాశుపతాస్త్రము; ఎవ్వని = ఎవనియొక్క; లావునన్ = శక్తివలన; ఈ = ఈ; మేనన్ = శరీరముతో; దేవేంద్రు = దేవేంద్రుని; పీఠ = సింహాసనము; అర్ధమున = సగములో {పీఠార్ధము - అర్ధసింహాసన మిచ్చుట అను గౌరవము.}; ఉండన్ = ఉండేటట్టి; పెంపున్ = గొప్పదనమును; కంటిన్ = పొందితిని; కాలకేయ = కాలకేయులు; నివాతకవచ = నివాతకవచులు {నివాతకవచుడు = బాణములచే ఛేదింపబడని కవచము కలవాడు}; ఆది = మొదలగు; దైత్యులన్ = రాక్షసులను; చంపితిన్ = సంహరించితిని; ఎవ్వని = ఎవనిని; సంస్మరించి = సంస్మరణ చేసి; గో = గోవులను; గ్రహణము = పట్టుకుపోవుచున్న; నాఁడు = రోజు; కురు = కౌరవ; కుల = వంశము అను; అంభోనిధిన్ = సముద్రమును; గడచితిన్ = దాటితిని; ఎవ్వని = ఎవనియొక్క; కరుణన్ = దయ; చేసి = వలన;
కర్ణ = కర్ణుడు; సింధురాజ = సైంధవుడు; కౌరవేంద్ర = దుర్యోధనుడు; ఆదుల = మొదలగువారి; తలల = శిరములందున్న; పాగలు = (తల) పాగాలు (వస్త్రాభరణములు); ఎల్లన్ = అన్నిటిని; తడవి = చేతులతో నిమురుట ద్వారా వెదకి; తెచ్చి = తీసుకొనివచ్చి; ఏ = ఏ; మహాత్ము = గొప్ప ఆత్మకలవాని; బలిమిన్ = శక్తివలన; ఇచ్చితి = ఇచ్చితిని; విరటుని = విరాటరాజు; పుత్రిక = కూతురు, ఉత్తర; అడుగన్ = అడగగ; బొమ్మ = ఆటబొమ్మల; పొత్తికల = పొత్తికల {పొత్తికల -పురుటికందులు, బొమ్మలు మొదలగువాని కొరకు వాడు మెత్తని గుడ్డలు}; కున్ = కోసము.

భావము:

అన్నా ఆ నాడు వరాహం కోసం సాగిన సమరంలో ఫాలనేత్రుని వల్ల పాశుపత మహాస్త్రాన్ని ఆయన దయవల్లనే కదా అందుకొన్నాను. త్రిలోకాధిశుడైన దేవేంద్రుని అర్ధసింహాసనాన్ని అయన అనుగ్రహం వల్లనే కదా అధిష్ఠింప గలిగాను. కాలకేయులు, నివాతకవచులు మొదలైన రాక్షసులను ఆ మహనీయుని బలం వల్లే కదా పరిమార్చాను. ఉత్తర గోగ్రహణ సందర్భంలో పొంగి వచ్చిన కౌరసేనావాహినిని ఆయన కరుణాకటాక్షం వల్లనే కదా దాట గలిగాను. ఆనాడు బొమ్మ పొత్తికలకు వస్త్రములు తెమ్మని ఉత్తర అడిగితే కర్ణ సైంధవ సుయోధనాదుల తలపాగలు తెచ్చి ఆమె ముద్దు చెల్లించగలిగింది ఆ పరమ పురుషుని దయవల్లనే కదా.