పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కృష్ణనిర్యాణంబు వినుట

  •  
  •  
  •  

1-365.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లోనఁ దలఁచిన విచ్చేసి లోవిలోని
శిష్టశాకాన్నలవముఁ బ్రాశించి, తపసి
కోప ముడిగించి, పరిపూర్ణకుక్షిఁ జేసె,
నిట్టి త్రైలోక్య సంతర్పి యెందుఁ గలఁడు?

టీకా:

దుర్వాసుఁడు = దుర్వాసుఁడు; ఒకనాడు = ఒకరోజు; దుర్యోధనుఁడు = దుర్యోధనుఁడు; వంపన్ = పంపగా; పదివేల = పదివేలమంది; శిష్యులు = శిష్యులు; భక్తిన్ = భక్తితో; కొలువన్ = మొక్కుతుండగ; చనుదెంచి = వచ్చి; మనమున్ = మనమందరము; పాంచాలియున్ = ద్రౌపది కూడా {పాంచాలి - పాంచాల దేశ రాకుమారి, ద్రౌపది}; కుడిచిన = తినిన; వెనుకన్ = తరువాత; ఆహారంబున్ = భోజనమును; వేఁడికొనినన్ = భిక్షగా అడిగి; పెట్టెదన్ = పెట్టెదను; అనవుడున్ = అనుడు; పెట్టకున్న = పెట్టకున్న; శపింతున్ = శాపము ఇచ్చెదను; అనుచున్ = అంటూ; తోయ = నీటిలో; అవగాహమున = స్నానముచేయుట; కున్ = కు; ఏఁగన్ = వెళ్ళగా; గడవలన్ = కుండలలో; అన్న = అన్నమును; శాకములు = కూరలును; తీఱుటన్ = నిండుకొనిన, ఖాళీ అగుటను; చూచి = చూసి; పాంచాలపుత్రిక = పాంచాలి {పాంచాలపుత్రిక - పాంచాలదేశ రాకుమారి, ద్రౌపది}; పర్ణశాల = పాక; లోనన్ = లోపల; తలఁచినన్ = స్మరించగ;
విచ్చేసి = వచ్చి; లోవి = వంటపాత్రలు; లోనిన్ = లోపలి; శిష్ట = మంచి; శాకాన్న = శాకాహారములు; లవమున్ = మిగిలిపోయిన పిసరుని; ప్రాశించి = స్వీకరించి; తపసి = తపస్సు చేయువాడు, ముని; కోపము = కోపము; ఉడిగించి = తగ్గించి; పరిపూర్ణ = పూర్తిగా నిండిన; కుక్షిన్ = కడుపు కలవానిగ; చేసెన్ = చేసెను; ఇట్టి = ఇలాంటి; త్రై = మూడు; లోక్య = లోకములకును; సంతర్పి = సంతృప్తిని కలిగించగలవాడు; ఎందున్ = ఎక్కడ; కలఁడు = ఉన్నాడు.

భావము:

ఒకనాడు ముక్కోపి అయిన దుర్వాసుడు దుర్యోధన ప్రేరితుడై పదివేల మంది శిష్యులతో మన వద్దకు వచ్చాడు, అప్పటికే మన మందరమూ, పాంచాలీ భుజించాము. ఆ సమయంలో ఆ మునీంద్రుడు "మాకు అన్నం పెట్టండి" అని అడిగాడు. పెడతాను అనగా, "పెట్టకపోతే శాపం పెడతాను" అంటూ చరచరా నదికి స్నానానికి సాగిపోయాడు. అప్పుడు పర్ణశాలలోకి పోయి పాంచాలి పాత్రలన్నీ పరికించి చూచింది. ఎక్కడా ఒక్క కూరముక్క కూడా కన్పించలేదు. ఆమె నిశ్చల హృదయంతో ఆ మహానుభావుణ్ణి తలచుకొంది. తక్షణం ఆ దయామయుడు ప్రత్యక్షమై, గిన్నిలో మిగిలి ఉన్న పిసరు తిన్నాడు. అంతే, మునీశ్వరుల కడుపులన్నీ నిండిపోయాయి. వారు శాంతించి తేనుపులు తేనుస్తూ వెళ్లిపోయారు. సంకల్పమాత్రం చేతనే ముల్లోకాలకూ సంతుష్టి కలిగించే అటువంటి మహానుభావుడు మనకు మరెక్కడ దొరుకుతాడు.