పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కృష్ణనిర్యాణంబు వినుట

  •  
  •  
  •  

1-363-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జిద్వీర్య! మఖాభిషిక్తమగు నీ యిల్లాలి ధమ్మిల్లమున్
లో శాత్రవు లీడ్చినన్, ముడువకా చంద్రాస్య దుఃఖింపఁగా,
యం బిచ్చి, ప్రతిజ్ఞ సేసి భవదీయారాతికాంతా శిరో
రశ్రీల హరింపఁడే విధవలై సౌభాగ్యముల్ వీడఁగన్?

టీకా:

ఇభజిత్ = సింహమువంటి {ఇభజిద్వీర్యుడు - ఏనుగును జయించు సింహమువంటి పరాక్రమము కలవాడు}; వీర్య = పరాక్రమము కలవాడా; మఖ = యజ్ఞమునందు; అభిషిక్తము = స్నానము చేసినది; అగు = అయినట్టి; నీ = నీయొక్క; ఇల్లాలి = భార్య యొక్క; ధమ్మిల్లమున్ = కొప్పు, జుట్టుముడిని; సభ = సభ; లోన్ = లో; శాత్రవు = శత్రువులు; ఈడ్చినన్ = ఈడ్చి లాగగ; ముడువక = ముడి వేసుకొనక; ఆ = ఆ; చంద్రాస్య = సుందరి {చంద్రాస్య - చంద్రుని వంటి ముఖము కలామె, స్త్రీ}; దుఃఖింపఁగాన్ = బాధ పడుతుండగ; అభయంబు = శరణు; ఇచ్చి = ఇచ్చి; ప్రతిజ్ఞ = ప్రతిన; సేసి = చేసి; భవదీయ = నీయొక్క; ఆరాతి = శత్రువుల; కాంతా = స్త్రీల యొక్క; శిరోజ = తలవెంట్రుకలను; భర = భారము అను; శ్రీలన్ = సంపదలను, శోభను; హరింపఁడే = పోగొట్టలేదా; విధవలు = భర్త పోయినవాళ్ళు, ముండమోపులు; ఐ = అయి; సౌభాగ్యముల్ = సౌభాగ్యములు {సౌభాగ్యములు - సౌభాగ్య చిహ్నములైన తలకట్టు తిలక ధారణాదులు}; వీడఁగన్ = తొలగిపోగా.

భావము:

సింహపరాక్రముడైన మహారాజా రాజసూయ మహాయజ్ఞంలో అభిషేకపూతమైన నీ యిల్లాలి కబరీభరాన్ని పట్టి లాగి ఈడ్చుకొని వచ్చి నిండు సభలో నీ శత్రువులు అవమానించి నప్పుడు ఆ సతి ఆక్రోశించగా, ఆమెకు అభయమిచ్చి దీక్ష వహించి, నీ శత్రుకాంతల శిరోజ వైభవాన్ని వారి సౌభాగ్యాన్ని హరించి మనకు జయం చేకూర్చిన ఆప్తబంధుడు ఆయనే కదా!